NRI News: లండన్ లో ఘనంగా ఉగాది వేడుకలు..

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది వేడుకలు నిర్వహించారు. ఏప్రిల్ 27న సత్తావిస్ పాటిదార్ సెంటర్‌, వెంబ్లీ, లండన్ లో ఉగాది వేడుకలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకాడమి అవార్డు గ్రహీత గీత, గేయ రచయిత డాక్టర్ చంద్రబోస్ హాజరయ్యారు. చంద్రబోస్ తెలుగు భాష మరియు సంస్కృతిని కీర్తిస్తూ ఆశువుగా పాటలు పాడారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వార్షిక పత్రికను డాక్టర్ చంద్రబోస్ ఆవిష్కరించారు.

సంగీత స్వరకర్త ఎం.ఎం. కీరవాణి గారితో సంయుక్తంగా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంపై మాట్లాడారు. వేదికపై అతని భార్య సుచిత్రతో కలిసి అతను తన కెరీర్, జీవితం గురించి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ చెందిన వనం శ్రీధర్, వంశీ మోహన్, పగడాల సత్యేంద్ర, దాసోజు రాములు, కుందుకూరి భారతి కలిసి నిర్వహించారు. తెలుగు భాష, సంస్కృతిని కాపాడేందుకు తెలుగు అసోషియేషన్ ఆఫ్ లండన్ ముందుంటుందని చెప్పారు.

Ugadi celebrations were organized under the aegis of Telugu Association of London

ఈ కార్యక్రమంలో గాయకులు దీపు, నూతన మోహన్ పాడిన పాటలకు ప్రేక్షకులు లేచి డ్యాన్స్ చేశారు. ఈ ప్రొగ్రామ్ నిర్వహించడానికి గత 4 నెలలుగా అహర్నిశలు శ్రమించిన ధర్మకర్తల మండలి కిరణ్ కప్పెట, అనిల్ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ మాడిశెట్టి, వెంకట్ నీల, రవి మోచర్ల, ఐటీ ఇంచార్జి రాయ్ బొప్పనలకు ఛైర్మన్ సబ్బ రవి కృతజ్ఞతలు తెలిపారు. మే 5న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ప్రీమియర్ లీగ్‌ ప్రారంభం అవుతుందని చెప్పారు.

14 వారాలలో టైటిల్ కోసం 10 జట్లతో పోటీ పడాలని అందరూ రావాలని ఛైర్మన్ రవి ఆహ్వానించారు. ఈస్ట్, వెస్ట్ లండన్‌లోని వేదికలపై మ్యాచ్‌లు జరుగుతాయని వివరించారు. ఈవెంట్‌ను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. మద్దతుదారులు యాప్‌లో స్కోర్‌లను కూడా తనిఖీ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+