Indian Students: చెదిరిన కల.. 21 మంది భారత విద్యార్థులను తిప్పి పంపిన యూఎస్..
పై చదువుల కోసం అమెరికకా వెళ్లిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురయింది. ఎంతో ఆశతో యూఎస్ లో అడుగు పెట్టిన విద్యార్థులు తిరిగి ఇండియాకు చేరుకున్నారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో చేరేందుకు భారత్ కు చెందిన 21 విద్యార్థులు గురువారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా, షికాగో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారు ఎయిర్ పోర్టులో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులను పలు డాక్యుమెంట్లు చూపాలిని కోరారు.
ఆ తర్వాత వారిని ఎయిరిండియా విమానంలో తిరిగి భారత్ కు పంపారు. విద్యార్థులు ఇమిగ్రేషన్ అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. విద్యార్థులు తిరిగి ఢిల్లీ చేరుకోనున్నారు. సాధారణంగా అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఇమిగ్రేషన్ అధికారులు ఉంటారు. అనుమానం వచ్చిన ప్రయాణికులను వారు ప్రశ్నిస్తారు. అవసరమైతే పత్రాలు కూడా చూపించమంటారు. ఇలా భారతీయ విద్యార్థుల వద్ద వారు వర్సిటీకి పే చేసిన బిల్లులు, విద్యార్థులు ఆర్థిక పరిస్థితి పత్రాలను చూశారు.

ఎలాంటి కారణం లేకుండా 21 మంది విద్యార్థులను డిపోర్ట్ చేశారు. దీంతో ఈ 21 మంది విద్యార్థులు మరో 5 వరకు అమెరికా వెళ్లడానికి సాధ్యం కాదు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థులను సుమార్ 16 గంటల పాటు ఇరుకు గదుల్లో కూర్చోబెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత తక్షణమే ఇండియా తిరిగి వెళ్లిపోవాలని చెప్పారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని కొందరు ప్రశ్నించగా.. జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు చెప్పారు. గతంలో కూడా చాలా మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చారు.
వారు అక్కడున్న యూనివర్సిటీల గురించి తెలియకుండా నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. తీరా అక్కడి వెళ్లకా.. అవి నకిలీ యూనివర్సిటీలని తేలడంతో వారు ఇండియాకు దిరిగి రావాల్సి వచ్చింది. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. విద్యార్థి బ్యాంక్ బ్యాలెన్స్ సరైన మొత్తంలో డబ్బు ఉందో లేదో చెక్ చేస్తారు. అయితే చాలా మంది విద్యార్థులు యూఎస్ వెళ్లాక పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు. భారతీయ విద్యార్థులతో స్థానికులకు పార్ట్ టైమ్ జాబ్ దొరకడం లేదని పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆంక్షాలు విధించారు.
అందుకే ఎయిర్ పోర్టులో దిగిన విద్యార్థుల వాట్సాప్, మెయిల్ చెక్ చేస్తుంటారు. వారి చాట్ లో పార్ట్ టైమ్ జాబ్ గురించి సమాచారం ఉంటే వారిని తిరిగి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications