NRI News: భారతీయులను తిప్పి పంపడంపై స్పందించిన అమెరికా..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి ఎవరి దేశం వారిని పంపిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ కు చెందిన వారిని తిప్పి పంపింది. వీరంతా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని అక్కడి అధికారులు తెలిపారు. అందుకే వారిని తిప్పి వారి వారి దేశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు.
ఆ విమాన ప్రయాణం గురించి ఇంతకు మించి ఏం మాట్లాడలేమని స్పష్టం చేశారు. అమెరికా భారత్ కు చెందిన 104 మందిని సీ-17 యుద్ధ విమానంలో ఇండియాకు పంపింది. ఆ విమానం టెక్సాస్ నుంచి బయల్దేరి పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో దిగింది. ఇండియాకు తిరిగి వచ్చిన వారిలో హర్యానా నుంచి 33, గుజరాత్ 33, పంజాబ్ 30, యూపీ 3, ఛంఢీఘర్ 2, మహారాష్ట్ర నుంచి ఇద్దరు ఉన్నారు. అయితే వారికి సంకెళ్లు వేసి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.

దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అమెరికా భారతీయులను తిప్పి పంపడంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. అక్రమ వలసదారులను తరలించడం ఇదేమి కొత్త కాదని గుర్తు చేశారు. అమెరికా 2009 నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదని తెలిపారు. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు కూడా భయంగా ఉన్నారు.
స్టూడెంట్ వీసాపై తమ దేశం వచ్చే వారికి పార్ట్ జాబ్ చేయడానికి వీలు లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. పార్ట్ టైమ్ జాజ్ చేస్తున్న వారిని అక్కడి అధికారులు పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పని చేస్తున్న భారతీయ విద్యార్థులు భయపడుతున్నారు. చాలా మంది అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూనే.. కాలేజీ ఫీ కట్టుకుంటూ ఉంటున్నారు. అమెరికా అధికారుల చర్యలతో వారు ఇబ్బందు పడుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications