మహిళలను రేప్ చేసిన కంప్యూటర్ సంస్థ యజమాని

2 women raped by computer institute owner
విశాఖఫట్నం: ఓ కంప్యూటర్ శిక్షణా సంస్థ యజమాని, తన ముగ్గురు మిత్రులతో కలిసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింకులు తాగించి మహిళలను రేప్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో సంఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

మహిళలకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింకులు తాగించి వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. పైగా, రేప్ చేస్తున్న దృశ్యాలను సెల్‌ఫోన్ కెమెరాలో బంధించారు. విశాఖపట్నంలోని పెందుర్తి పోలీసు స్టేషనులే బాధితులు ఫిర్యాదు చేశారు. నలుగురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు, కంప్యూటర్ శిక్షణా సంస్థ యజమాని భార్య పరారీలో ఉన్నారు.

కంప్యూటర్ సంస్థ యజమాని డి. శ్రీకాంత్, అతని భార్య రత్నం, అతని బావమరిది అచ్చిరాజులను పోలీసులు నిందితులుగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు శ్రీకాంత్ మిత్రులు వల్ల, శ్రీను. పోలీసులు శ్రీకాంత్‌ను, అచ్చిరాజును అరెస్టు చేసారు. పాతికేళ్లకు తక్కువ వయస్సు గల ఇద్దరు బాధితులు కూడా గతంలో ఈ సంస్థలో పనిచేశారు.

జన్మదిన వేడుకలకు రావాలని శ్రీకాంత్ ఆ ఇద్దరు మహిళలను పాపాయపాలెంలోని తన నివాసానికి ఆహ్వానించాడు. బాకీ పడిన మూడు నెలల వేతనాన్ని ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు. రత్నం వారిద్దరిని దుర్భాషలాడడమే కాకుండా వారిపై చేయి చేసుకుంది. సంస్థ మూసివేతకు వారే కారణమంటూ శ్రీకాంత్ కూడా అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ మహిళలను శ్రీకాంత్ మిత్రులు పట్టుకుని రేప్ చేశారు. ఈ చర్యను శ్రీకాంత్ భార్య చూస్తూ ఉండిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+