కాల్ సెంటర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

సంఘటనపై ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ఉద్యోగిని దంపతులు రెండు రోజులు తీసుకున్నారు. వీరు ఢిల్లీలోని బావనలో ఉండేవారు. భార్యకు కాల్ సెంటర్‌లో ఉద్యోగం రావడంతో ఇటీవలే దక్షిణ ఢిల్లీకి మారారు. కేసులో ప్రధాన నిందితుడు సూరజ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మోహన్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీలో తనకు చాలా మంది సీనియర్ అధికారులు తెలుసునని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు.
కంపెనీ యజమాని ఇంటర్వ్యూ చేస్తాడని చెప్పి ఆమెను సాయంత్రం పూట బాదర్పూర్ ఫ్యాక్టరీకి సూరజ్ తీసుకుని వెళ్లాడు. ఆదివారం కావడంతో కర్మాగారం మూసేసి ఉంది. ఎవరూ లేరు. అప్పటికే సూరజ్ మిత్రులు ముగ్గురు అక్కడ ఉన్నారు. ఆమెను బలవంతంగా లోనికి తీసుకుని వెళ్లారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.
బాధితురాలు అతి కష్టం మీద బావనలోని తన భర్త చెంతకు చేరుకుంది. భయంతో ఫిర్యాదు చేయడానికి రెండు రోజులు ఆగారు. ఎట్టకేలకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, కేసు నమోదు చేశారు. సూరజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని మిత్రుడు దీపును అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications