గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు ఆ ఎస్సై: అయినా ప్రమోషన్

Row over promotion of rape accused SI
విశాఖపట్నం: వాకపల్లి సామూహిక అత్యాచారం కేసు నిందుతుడైన సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ప్రమోషన్ ఇవ్వడం వివాదంగా మారింది. ఓ భూవివాదం కేసులో కూడా అతను నిందితుడు. ఎ రవికుమార్‌కు పోలీసు శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా జి మాడుగుల మండలం వాకపల్లి గ్యాంగ్ రేప్ కేసులో అతను ప్రధాన నిందితుడు.

రవి కుమార్ పాడేరు ఎస్సైగా ఉన్నప్పుడు గ్రేహౌండ్స్ సిబ్బంది వాకపల్లి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 11 మంది గిరిజన మహిళలపై 2007 ఆగస్టు 20వ తేదీన గ్రేహౌండ్స్ సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. 11 మంది మహిళల్లో ఇద్దరు మహిళలు మరణించారు.

ప్రత్యేక పోలీసు బలగానికి చెందిన సిబ్బంది గ్రామస్థులపై దాడి చేసి, తుపాకులతో బెదిరించి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హక్కుల కార్యకర్తలు, పౌర హక్కుల సంఘాల నాయకులు ఆందోళనలకు దిగడంతో రవిపై, మరో 12 మంది పోలీసులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా సాగుతోంది.

సామూహిక అత్యాచారం కేసులో నిందితుడైన అధికారికి ప్రమోషన్ ఇవ్వడం సరి కాదని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి విఎస్ కృష్ణ అన్నారు. ఆరోపణలపై నిగ్గు తేలేవరకు రవి కుమార్ ప్రమోషన్‌ను పెండింగులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions