బాలికపై అత్యాచారం: రోడ్డుపై స్వామీజీకి చెప్పు దెబ్బలు

Visakhapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల బాలికపై ఆశ్రమ నిర్వాహకుడు పున్నయ్య స్వామీజీని స్థానికులు చెప్పు దెబ్బలతో సత్కరించారు. అతను కొద్దిరోజులుగా ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక బయటకు వెల్లడించింది. దీంతో ఆదివారం స్థానికులు, ప్రజాసంఘాల కార్యకర్తలు కలిసి స్వామీజీకి దేహశుద్ధి చేశారు. ఆశ్రమంలో నుంచి బయటకు తీసుకువచ్చి రోడ్డు చితకబాదారు.

బాధిత బాలిక కూడా స్వామీజీని చెప్పుతో కొట్టింది. అనంతరం అర్ధనగ్నంగా నడిపించుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. విశాఖ నగరంలోని వెంకోజీపాలెంలో 30 ఏళ్ల క్రితం స్థాపించిన జ్ఞానానంద ఆశ్రమంలో నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీని ప్రస్తుత నిర్వాహకుడు పున్నయ్య స్వామీజీ. ఇందులో 100 మంది వరకు బాలికలకు ఆశ్రయంతో విద్యను అందిస్తున్నారు.

ఆ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై స్వామీజీ తరచూ అత్యాచారం చేస్తున్నట్టు తెలిసింది. ఎవరికీ చెప్పవద్దని సదరు బాలికను హెచ్చరించినట్టు తెలిసింది. భయపడిన ఆ బాలిక ఆశ్రమం నుంచి ఇంటికి రాగా తల్లి అడిగినా ఏమీ చెప్పలేదు. గట్టిగా నిలదీయడంతో స్వామిజీ లైంగిక వేధింపులు, అత్యాచారం గురించి చెప్పింది.

వెంటనే ఆమె స్థానికులు, ప్రజాసంఘాల వారితో కలిసి ఆశ్రమానికి వెళ్లి స్వామిజీని చితకబాదారు. అర్ధనగ్నంగా రోడ్డుపై కొట్టుకుంటూ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. తాను నిర్దోషినని, ఆశ్రమం ఆస్తులపైన కన్నేసిన కొంతమంది కుట్ర పన్ని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్వామీజీ అంటున్నారు. బాలికపై అత్యాచారం చేయలేదని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions