మద్యం తాగించి మహిళపై రేప్, ఆ తర్వాత హత్య

Woman raped and murdered
అనంతపురం: మద్యం తాగించి వితంతు మహిళపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేశారు. అనంతపురం జిల్లా అమడగూరు మండలం మహ్మదాబాద్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మండలంలోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన వితంతువు నరసమ్మ(50) ఇళ్లల్లో పని చేసుకుని జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందినవారు ఇంట్లో పని ఉందని చెప్పి శుక్రవారం రాత్రి వెంట తీసుకువెళ్లారని, అర్ధరాత్రి దాటిన తరువాత వారు మద్యం తాగి అనంతరం ఆమెకు సైతం తాగించారని ఆరోపణలు వచ్చాయి.

శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. శనివారం ఉదయం ఎరుకల కిష్టప్ప ఇంటి సమీపంలో మృతదేహంగా పడివుండటాన్ని స్థానికులు గమనించారు. నోటిలో గుడ్డలు కుక్కి, అ త్యాచారం చేసి, ఆపై హత్య చేసివుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరుకల కిష్ట, మరో యువకుడు ఆదినారాయణపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని, వి చారిస్తున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరు న రసమ్మను అంట్లు తోమే పనుందని ఇంటికి పిలుచుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హతమార్చి, దగ్గరలోని ఓ మి ద్దెపై నుంచి కింద పడేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. విష యం తెలుసుకున్న కదిరి డీఎస్పీ కరీముల్లా షరీఫ్, నల్లమాడ సీఐ ఖాసీంసాహెబ్, ఎస్ఐ గణేష్, తహసీల్దార్ హుస్సేన్‌బాషా అక్కడికి చేరుకుని, వి చారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ చెప్పారు.

నరసమ్మ హత్యాచారంపై గ్రామస్థ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శి క్షించాలని కోరుతూ ఆందోళనకు దిగా రు. వారిని గ్రామ బహిష్కరణ చేయాలన్నారు. రోడ్డుపై నినాదాలు చేస్తూ ఐ దుగంటలపాటు బైఠాయించారు. నరసమ్మ కుటుంబానికి రూ.5 లక్షలు నగ దు, ఐదెకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions