మైనర బాలికపై రేప్: బావిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

Minor girl raped in Warangal district
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కీచక పర్వం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని శివనగర్ జంగాలపల్లిలో ఓ చిన్నారిపై అరవింద్ అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతను అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులుకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

దొంగల ముఠా పట్టివేత

అనంతపురం జిల్లాలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న దోపిడీ ముఠాను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తపంచా, ఐదు బులెట్లు, రెండు నాటు బాంబులతో పాటు 15 తులాల బంగారం, లక్షన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. పది మందితో కూడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండు లారీలు పర స్పరం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

బావిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం బాకనంబ పల్లెలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు చెరువులో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. బట్టలు ఉతికేందుకు వెళ్లి చెరువులో పడిపోయినట్లు తెలుస్తోంది. మృతులు సంధ్య, లిఖితగా గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకలో ప్రమాదం, ముగ్గురి మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం వాసులుగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions