అమ్మాయిపై గ్యాంగ్ రేప్: మహిళపై యువకుడి రేప్

నిందితులను పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. నలుగురు యువకులు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న బాలికను ఈ నెల 17వ తేదీన అడ్డుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతంపై బాలిక డిడి నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదున చేసింది.
నిందితులను రాకేష్ కుమార్ (18), విజయం కుమార్ వర్మ (20)లుగా గుర్తించారు. మరో ఇద్దరు మైనర్ బాలురున్నారు. వీరంతా అదే ప్రాంతానికి చెందినవారు. బాలికను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఘాతుకానికి పాల్పపడ్డారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఇదిలావుంటే, ఇండోర్‌లో ఓ యువకుడు వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సూరజ్ పవార్ (19)గా గుర్తించారు. పవార్ ఈ నెల 17వ తేదీన ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న 22 మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పారిపోయాడు.












Click it and Unblock the Notifications