ఫొటో జర్నలిస్టుపై రేప్: నిందితులపై మరో రేప్ కేసు

Another rape complaint filed against Mumbai gang of 5
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు మరో అత్యాచారానికి పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఐదుగురు నిందితులు తనపై కూడా అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఆగస్టు 22న శక్తి మిల్స్ పరిసర ప్రాంతంలో ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన స్థలంలోనే తనను అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన కాసీమ్ బెంగాలీని ఆగస్టు 30న ముంబైలో కోర్టు ఎదుట హాజరుపర్చారు.

నిందితులపై మరో నలుగురు మహిళలపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
కాగా ఫొటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళలు ఎగిసిపడ్డాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

నిరుడు డిసెంబర్ 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన ఘటనను మరవకముందే ఇలాంటివి మళ్లీ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions