బాలికను ఆటో డ్రైవర్ లొంగదీసుకుని గర్భం చేశాడు

దాంతో నాటు పద్ధతిలో అబార్షన్ చేయగా వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. దీంతో శుక్రవారం కుటుంబ సభ్యులు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాడు చేశారు. కేసు నమోదు చేసుకుని, ఆటో డ్రైవర్ దుర్గారావును అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.
ఇదిలావుంటే, రెండు హత్యల కేసులో నిందితుడైన యుగంధర్ రెడ్డిని కర్నూలు పోలీసులు శ్రీశైలంలో అరెస్టు చేశారు. అతడ్ని పోలీసులు శ్రీశైలం నుంచి కర్నేూలు తరలిస్తుండగా అతను దోర్నాల వద్ద సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కాగా, నిజామాబాద్ జిల్లా మద్నూరు ఆధర్శ పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటిచి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications