ఇంతకీ ‘పెద్ది’ హిట్టా? ఫట్టా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద 27 రోజులు పూర్తి చేసుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు ఖాయమనే రేంజ్‌లో ప్రశంసలు దక్కాయి. అయితే, ఈ సినిమా కమర్షియల్‌గా హిట్టా? లేక ఫ్లాపా? అనే దానిపై ట్రేడ్ వర్గాల నుంచి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి.
రికార్డులు బద్దలు కొట్టినా.. టార్గెట్ రీచ్ అవ్వలేదు!
ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'పెద్ది' నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రీజినల్ హిట్ అయిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా కలెక్షన్లను కూడా ఈ మూవీ దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ 'సాక్నిల్క్' ప్రకారం.. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 337.25 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియాలోనే రూ. 284.35 కోట్లు రాగా, ఓవర్సీస్ నుంచి రూ. 53 కోట్లు వచ్చాయి. దీని ద్వారా నిర్మాతలకు అందింది సుమారు రూ. 160 నుంచి 170 కోట్ల షేర్ మాత్రమే.

క్లోజింగ్ కలెక్షన్స్.. రూ. 50 కోట్ల నష్టం?
సినిమా ఎంత పెద్ద రికార్డులు క్రియేట్ చేసినా, బిజినెస్ లెక్కల ప్రకారం ఇది 'లాస్ ప్రాజెక్ట్' గా మిగిలిపోయేలా ఉంది. ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వచ్చి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 220 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ప్రస్తుతానికి ఇంకా రూ. 50 నుంచి 60 కోట్ల వరకు భారీ లోటు కనిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా రన్ దాదాపు ముగింపునకు వచ్చింది. రోజుకు కేవలం రూ. 30 లక్షల లోపే వసూళ్లు వస్తుండటంతో, ఈ వారంతో థియేటర్ల నుంచి ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రశంసలు దక్కాయి కానీ.. కాసులు రాలేదు!
సినిమా యూనిట్ పైకి ఇది పెద్ద హిట్ అని చెబుతున్నప్పటికీ.. ఓవర్సీస్, నార్త్ ఇండియా, కర్ణాటక వంటి ఏరియాల్లో వాళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగానే నష్టాలు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. కథ పరంగా, రామ్ చరణ్ నటన పరంగా 'పెద్ది' సినిమా విమర్శకుల నుంచి అద్భుతమైన మార్కులు కొట్టేసింది. కానీ, ఆ పాజిటివ్ టాక్ కమర్షియల్‌గా భారీ కలెక్షన్లుగా మారడంలో విఫలమైంది. ఫలితంగా, క్రిటికల్‌గా సూపర్ హిట్ అనిపించుకున్న 'పెద్ది'.. బాక్సాఫీస్ వద్ద మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చినట్టు స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications