అభిషేక్ శర్మ స్థానానికి ఎర్త్ పడింది: ఇకపై అతనే
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సంచలనం సృష్టించాడు. అభిషేక్ శర్మను వెనక్కి నెట్టాడు. కెరీర్ లో మొదటిసారిగా ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఇషాన్ కిషన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో టోర్నమెంట్‌లో మొత్తం మీద 317 పరుగులు సాధించాడు. ముఖ్యంగా కొలంబోలో పాకిస్తాన్‌పై అతను ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ జట్టును గెలిపించడమే కాకుండా, అతడిని కెరీర్ బెస్ట్ రేటింగ్‌కు చేర్చింది. ప్రస్తుతం అభిషేక్ శర్మ కంటే ఏడు రేటింగ్ పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో ఇషాన్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఇషాన్ కిషన్ మొత్తం 876 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. అభిషేక్ శర్మ 869 పాయింట్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 848 పాయింట్లతో మూడు, 792 పాయింట్లతో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నాలుగు స్థానాల్లో నిలిచారు. పాథుమ్ నిశ్శంక- 751, తిలక్ వర్మ- 747, జోస్ బట్లర్- 716, సూర్యకుమార్ యాదవ్- 708, మిఛెల్ మార్ష్- 702, డెవాల్డ్ బ్రెవిస్- 702 పాయింట్లతో ఆ తరువాతి అయిదు స్థానాల్లో నిలిచారు.
టీ20ల్లో భారత్ హవా.. ఐసీసీ తాజా ఈక్వేషన్లు
ఈ తాజా ఘనతతో టీ20 అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న నాలుగో భారతీయ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. దాదాపు ఏడాది కాలంగా నంబర్ వన్ స్థానంలో కొనసాగిన అభిషేక్ శర్మ ఇప్పుడు రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
అలాగే ఆల్‌రౌండర్ల విభాగంలో శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌తో ఇటీవలే ముగిసిన సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఐర్లాండ్ ఆటగాళ్లకు కూడా ఈ రౌండ్ ర్యాంకింగ్స్‌లో సంచలనం రేపారు. లార్కాన్ టక్కర్ నాలుగు స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి, రాస్ అడైర్ 84వ స్థానానికి చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మాథ్యూ హంఫ్రీస్ నాలుగు వికెట్లు పడగొట్టి, తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 25వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
ఐర్లాండ్ ఆటగాళ్లు గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్ కూడా తమ స్థానాలను మెరుగుపరచుకున్నారు. మరోవైపు ఐసీసీ టెస్ట్ క్రికెట్ విభాగంలోనూ ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మళ్లీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ నంబర్ వన్ లీగ్ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీని అధిగమించి ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
టెస్ట్ బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ తొలిసారిగా ప్రపంచ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్ విఫలం కావడంతో హెడ్‌కు ఈ అవకాశం దక్కింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకడం విశేషం.
కాగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ విజయంలో కీ రోల్ పోషించిన పేసర్లు షమర్ జోసెఫ్, కేమర్ రోచ్ వరుసగా 14, 17 స్థానాలకు చేరుకున్నారు. న్యూజిలాండ్ టెస్ట్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచేల్ కూడా ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. తాజా మార్పులు ప్రపంచ క్రికెట్‌లో కొత్త పోటీ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.













Click it and Unblock the Notifications