AP EAPCET 2026 ఫలితాలు విడుదల..! ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలు (AP EAPCET 2026 results)
ఎట్టకేలకు విడుదలయ్యాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి ఇవాళ, రేపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ ఫలితాలు నిన్న కూడా విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే చివరి నిమిషంలో సీబీఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాలు రాకపోవడంతో వాయిదా వేశారు. వీటిని ఇవాళ విడుదల చేశారు.

AP EAPCET 2026 results released here is how to check and download score cards

AP EAPCET2026లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తం 3.29 లక్షల మంది ఈ ఏడాది పరీక్ష రాయగా.. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1,82,317 మంది అర్హత సాధించారు (70.52%). అలాగే అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో కలిపి 63,546 మంది అర్హత సాధించారు (89.59%). 71.65% ఉత్తీర్ణత శాతంతో ఇంజనీరింగ్‌లో అమ్మాయిలు ముందంజలో నిలవడం గర్వకారణమని లోకేష్ తెలిపారు.

ఈఏపీసెట్ ర్యాంక్ కార్డుల్ని అధికారిక వెబ్ సైట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EAPCET ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చని నారా లోకేష్ తెలిపారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు హాయ్ అనే మెసేజ్ పెట్టి కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చని లోకేష్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+