ప్రియుడి వద్దకు తీసుకెళ్తానని పలుమార్లు రేప్ చేశాడు

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా గాలివీడు మండల కేంద్రమైన శెట్టిపల్లెకు చెందిన కుటుంబం.. కూలీ పనుల కోసం చిత్తూరు జిల్లా మదనపల్లెలో నివాముంటున్నారు. వీరి కుమార్తె (14) నాయనమ్మ ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది. బాలిక గాలివీడుకు చెందిన సాయితో ప్రేమలో పడింది. ఇది తెలిసి వారిని మందలించిన తల్లిదండ్రులు, కుమార్తెను తమవద్దే ఉంచుకున్నారు.
కొన్ని రోజుల తర్వాత బాలికను కలిసేందుకు సాయి వచ్చాడు. ఇది చూసిన బాలిక తల్లిదండ్రులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన బసినికొండకు చెందిన విజయ్ అనే వ్యక్తి సాయిని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే బాలికతో పరిచయం పెంచుకున్న విజయ్.. సాయితో వివాహం చేస్తానని నమ్మబలికి ఆమెను కర్ణాటకలోని బెంగళూరుకు తీసుకెళ్లాడు.
ఓ అద్దె గదిలో నిర్బంధించాడు. ఆమెను బెదిరింపులకు గురి చేసి పదిరోజులపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు విజయ్. ఆ తర్వాత ఆమెను తిరిగి మదనపల్లెకు తీసుకొచ్చి వదిలేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పరారయ్యాడు. కాగా, అవమాన భారం భరించలేక ఆ బాలిక ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications