అత్యాచార యత్నం, దగ్ధం: పోరాడిన బాలిక మృతి

బాధితురాలు భూక్యా కిరణ్మయి(14) ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో 11 రోజులుగా చికిత్స పొందుతూ ఉంది. సోమవారం ఆమెను మృత్యువు కబళించింది. ఈ నెల 18న గార్ల మండలం తిర్లాపురం కొత్తతండాలో భూక్యా కిరణ్మయిని అదే గ్రామానికి చెందిన లావుడ్యా బాబురావు (19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యా చారం చేయడానికి విశ్వ ప్రయత్నం చేయగా తీవ్రంగా ప్రతిఘటించిన చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన జరిగింది.
నాటి నుండి బాలిక ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచింది. దీంతో గ్రామంలో మృత్యురాలి బందువుల రోదనలతో పలువురిని కంట తడి పెట్టించాయి.
కూలీ పనులు చేసుకుంటూ ఖమ్మంలో తన కూతురిని చది విస్తున్నానని వీరన్న, భార్య శారద బోరున విలపించారు.స్థానికంగా బాలిక మరణం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications