కారులో తిప్పుతూ ఉగాండ మహిళపై అత్యాచారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. భారత పర్యటనకు వచ్చిన ఉగాండ దేశానికి చెందిన ఓ మహిళ(35)పై ఇద్దరు యువకులు కారులో ఎక్కించుకుని తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్ దగ్గర నిలుచున్న ఆ మహిళను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకుని తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు.
అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో పడేసి నిందితులు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పిన పోలీసులు, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.
మరో ఘటనలో ఓ మహిళతో బలవంతంగా వ్యభిచారం చేయించిన కేసులో నిందితుడు శాంతారాం అనే వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 54వేల జరిమానా కూడా విధించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications