యువతిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

వీరిద్దరు భువనగిరిలో వివిధ కంపెనీలకు చెందిన గృహోపకరణాలను విక్రయిస్తుంటారు. హన్మకొండలో వీరిద్దరు ఆటో ఎక్కగా అప్పటికే ఆటోలో ఇద్దరు యువకులు ఉన్నారు. హన్మకొండ నుండి స్టేషన్‌ఘనపూర్‌కు చేరుకోగానే ఆటోలో ఉన్న వ్యక్తులు మద్యం సీసాలు కొనుగోలు చేసి పెట్రోల్‌బంక్‌లో డీజిల్ పోసుకొని జనగామ వైపు బయల్దేరారు.
రఘునాథపల్లి దాటిన తర్వాత నిడిగొండ బ్రిడ్జి సమీపంలోకి ఆటో చేరుకోగానే ప్రధాన రహదారి నుండి బ్రిడ్జి పక్కన గల రోడ్డు వైపు ఆటోను దారి మళ్లించారు. ఆటోను ఎందుకు దారి మళ్లిస్తున్నారని ఇద్దరు యువతులు ప్రశ్నిస్తుండగానే ఆటోలో ఉన్న ఇద్దరు యువతుల్లో ఒకరిని ఇద్దరు యువకులు బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఆటోలో ఉన్న మరో యువతికి ఆటో డ్రైవర్‌ను కాపలాగా ఉంచారు. పక్కకు తీసుకెళ్లిన యువతిపై అత్యాచారం చేశారు.
తరువాత ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. రాత్రి 10గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున మూడుగంటల వరకు అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గత్యంతరం లేక అదే ఆటోలోనే జనగామకు వెళ్లామని, జనగామలో ఆటోను ఆపమని డ్రైవర్‌ను కోరగా ఆపకుండా వెళ్తుండడంతో ఆటోలో నుండి దూకానని రెండు చేతులకు గాయాలు అయ్యాయని చెప్పింది. తమని జనగామలోనే దింపేసి ముగ్గురు యువకులు ఆటోలో పరారయ్యారని బాధితురాలు తెలిపింది. నిందితుల్లో ఒకడి పేరు శివ అని తెలిసింది. జనగామలో 100కు ఫోన్ చేయగా జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications