Value Zone: నాచారంలో అతి పెద్ద హైపర్ మార్ట్ - వాల్యూ జోన్ ప్రారంభం..
పటాన్ చెరులో అద్భుత విజయం సాధించిన హైపర్మార్ట్ - వాల్యూజోన్ ఇప్పుడు నాచారంలో అందుబాటులోకి వచ్చింది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా హైపర్ మార్ట్ కు అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ మాల్ ను గురువారం ప్రారంభించారు. హైపర్ మార్ట్ వాల్యూ జోన్ ను
పి.వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణ స్థాపించారు. ఇది అన్ని అవసరాలు తీర్చే షాపింగ్ గమ్యస్థానంగా మారింది.
ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్వేర్, లగేజ్, ఫర్నిషింగ్, స్టేషనరీ, సాధారణ సరుకులతోపాటు ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ, భారతీయ బ్రాండ్లను వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించింది. ఒకేచోట సమగ్ర రిటైల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. నాచారంలో ప్రారంభమైన వాల్యూజోన్ హైపర్మార్ట్ కు పరిసర ప్రాంతాల వారు సులభంగా అక్కడి చేరుకోవచ్చు. ఇది కుటుంబాలకు ఆదర్శవంతమైన షాపింగ్ గమ్యస్థానంగా మారుతుంది. రాయితీ బ్రాండెడ్ ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు రోజంతా షాపింగ్ చేయగలిగేలా అవకాశం కల్పిస్తుంది.

మాల్ ను ఫ్యాషన్, ఆహారం, వినోదాలతో కూడిన ప్రత్యేకమైన రిటైల్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఔట్లెట్ మాల్ గా రూపొందించారు. వాల్యూజోన్ ఖచ్చితంగా గొప్ప రిటైల్ ఫార్మాట్ అని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఉత్పత్తుల శ్రేణి, షాపింగ్ అనుభవం, సాటిలేని రీతిలో హైదరాబాద్ కు గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వాల్యూజోన్ లో కలెక్షన్లు, బ్రాండ్లు, ఆహ్లాదకరమైన సమయం వినియోగదారుల కోసం ఏర్పాటు చేశారు. ఫ్యాషన్, నిత్యావసర సరుకులు, సాధారణ వస్తువులపై 365 రోజులూ అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.
1.7 లక్షల చదరపు అడుగులతో మునుపెన్నడూ లేని షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. వెడల్పు అయిన ఐల్స్, హ్యాసిల్-ఫ్రీ చెకౌట్ కోసం 40+ క్యాష్ కౌంటర్లు ఉన్నాయి. 2000+ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఒక వస్తువు కొనుగోలుపై మరొకటి పొందే అవకాశం ఉంది. ఇందులో 10,000+ కిరాణా వస్తువులు ఉంటాయి. మీ అవసరాలన్నీ ఒకేచోట లభిస్తాయి. బహుళ వస్త్రాల బ్రాండ్లకు చెందిన 1000+ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 100 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఉన్నాయి. 2000+ రకాల సిల్క్ చీరలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications