keyboard_backspace

రాఫేల్ జెట్స్: అత్యాధునిక ఫైటర్ జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాలు.. 2019 నుంచి ఈ యుద్ధ విమానాల పేరు ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కోర్టుల చుట్టూ సైతం తిరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాఫేల్ వ్యవహారంలో మోడీ సర్కార్ గోల్‌మాల్ చేసిందంటూ ఆరోపణాస్త్రాలు కూడా సంధించారు. అన్ని వివాదాలను ఎదుర్కొని ఫ్రాన్స్ నుంచి ఎట్టకేలకు భారత్‌కు బయలుదేరాయి రాఫేల్ యుద్ధ విమానాలు. ఇంతకీ ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత ఏమిటి..?

రాఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌లోని దస్సాల్ట్ ఏవియేషన్ ఎయిర్‌బేస్‌ నుంచి భారత్‌కు బయలు దేరి భారత ఆర్మీలో చేరనున్నాయి. మొత్తం ఐదు విమానాలు ఇండియన్ ఆర్మీలో చేరనున్నాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ కానున్నాయి. అయితే ఏడుగంటలకు పైగా ప్రయాణించిన ఈ యుద్ధ విమానాలు కాసేపు యూఏఈలో విశ్రాంతి తీసుకున్నాయి. ఇక మొత్తం ఐదు జెట్లలో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు ఉండగా రెండు ట్విన్ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. గతేడాది అక్టోబరులో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి రాఫేల్ జెట్ విమానాన్ని అందుకున్నారు. ఈ రాఫేల్ జెట్ యుద్ధ విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Rafale Jets: Here is all the info that you need to know about French fighter jets

రాఫేల్ యుద్ధ విమానాల్లో ఎన్నో రకాల ఆయుధాలను అమర్చే వీలుంది. హ్యామర్ మాడ్యులర్‌ రాకెట్‌ను రాఫేల్‌లో అమర్చే అవకాశం ఉంది. అంటే గాల్లో నుంచి భూమిపై ఉన్న శత్రువులను వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా రాకెట్లను విడుదల చేసే సామర్థ్యం రాఫేల్‌కు ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచే హ్యామర్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది భారత వాయుసేన. తక్కువ సమయమే ఉన్నప్పటికీ రాఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చేస్తున్న నేపథ్యంలో వాటిని సప్లై చేసేందుకు వెంటనే అంగీకారం తెలిపింది ఫ్రాన్స్ సంస్థ. 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న హ్యామర్ మిస్సైల్స్ ను ఎమర్జెన్సీ పద్ధతిన భారత మిలటరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఎమర్జెన్సీ పద్ధతిలో అవసరమైన వాటిని కొనుగోలు చేసేందుకు అన్ని అధికారాలు కల్పించింది.

ఇక హ్యామర్ తర్వాత రాఫెల్ యుద్ధ విమానాల్లో లాంగ్ రేంజ్ రాకెట్ మీటియార్‌ను కూడా మోసుకెళ్లగలదు. ఇది గాలిలో ఉన్న సమయంలోనే శత్రువులను టార్గెట్ చేయగల కెపాసిటీ ఉంది. మైకా అనే వెపన్ కూడా మీటియార్‌లానే ఉంటుంది. ఇది కంటికి కనిపించకుండా ఉన్న లక్ష్యాలను చేధించగలదు. ఇక స్కాల్ప్ అనే లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను కూడా రాఫేల్ యుద్ధ విమానాలు మోసుకెళ్లగలవు. ఏఎం 39 ఎక్సోసెట్ అనే యాంటీ షిప్ మిస్సైల్స్‌ను ఇవి మోసుకెళ్లగలవు. ఇదిలా ఉంటే రాఫేల్ యుద్ధ విమానాలు వాటి బరువుతో సమానంగా ఉండే పేలుడు పదార్థాలను లేదా ఆయుధాలను నింగిలోకి మోసుకెళ్లగలవు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం 2016లో 36 రాఫెల్ జెట్స్ కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58వేల కోట్లను చెల్లించింది.

రాఫేల్ యుద్ధ విమానాలు ఏకధాటిగా 3700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. అంతేకాదు గంటకు 1389 కిలోమీటర్ల టాప్ వేగంతో ప్రయాణిస్తాయి. దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ఈ తరహా విమానాలను నడిపేందుకు పైలట్లకు దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

English summary
Rafale fighter jets that will join the Indian Air Force on Wednesday can integrate a variety of armaments and have been cleared to operate many weapons such as Hammer, Meteor and Mica missiles.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X