keyboard_backspace

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి ఏంటి.. దీని విశిష్టత ఏంటి..?

Google Oneindia TeluguNews

రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్ట్ 22 న వస్తుంది.

ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు. రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ? ఆ చరిత్ర ఏంటి ? అనేది తెలుసుకుందాం .

Raksha Bandhan:Know the History and Significance Of Rakhi Pournami

పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని , భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.

ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడువేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతి హామీ అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి.

అంతే కాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లిన ఉండిపోగా, విష్ణు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి , రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. ఈనాటికీ ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక గా జరుపుకుంటారు.

సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.

రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. "యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్కడైతే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే, నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షా బంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీ మణులకు ఎనలేని ప్రేమ . వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. తీపి జ్ఞాపకంగా భావిస్తారు.

ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోలెడన్ని రాఖీల సందడి నెలకొంది. ఈ సంవత్సరం బంగారం, వెండి రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది .మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి .ఇక సోదరుల పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకున్నవారు లేక పోలేదు. గతేడాది రాఖీ పండుగ కరోనా మహమ్మారి కారణంగా సరిగ్గా జరుపుకోలేని వారంతా ఈ ఏడాది రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైన రాఖీలను సోదరుల కోసం కొనుగోలు చేస్తున్నారు.

రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరీమణులు రక్షాబంధనాన్ని కట్టుకున్న తరువాత ఈ పనులు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట. రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే, పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు మరణం తరువాత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు . పండుగ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో , అవసరమైన వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితమంతా భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెప్తుంటారు.

రక్షా బంధన్ రోజున చంద్రుడు తో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని ఆరోజు నవగ్రహాల శాంతి తో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, సోదర సోదరీమణులు ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారని ప్రతీతి. రక్షాబంధనం అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలకే కాదు మానవ సంబంధాలకు, అనుబంధాలకు సంబంధించిన పండుగ.అందుకే ఈ రాఖీ పండుగను ప్రియమైన వారితో ఘనంగా జరుపుకోండి.

English summary
Rakshabandhan is A festival celebrated across the country by brothers and sisters to make their relationship last most sacred.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X