ఇందిరా గోస్వామి, అస్సామీల గుండె చప్పుడు

అస్సాం భాషలోని విభిన్నతల మధ్య సామాజిక, సాంస్కృతిక రాజకీయాలపరంగా సంబంధాలకు ప్రత్యేకతను ఇస్తూ అస్సామీ సామాజిక వర్గాలను చిత్రీకరించారు. అయితే, మొత్తంగా అస్సామీల ఉనికిని ఆమె చాటి చెప్పారు. మిలిటెంట్ తిరుగుబాటు నేపథ్యంలో జాతిపర సంఘర్షణలను పరిష్కరించడానికి సమకాలీన రాజకీయ స్వభావాన్ని ఆమె చిత్రీకరించగలిగారు. ఆ కారణంగానే ఆమె కేంద్ర ప్రభుత్వానికి, ఉల్ఫా తిరుగుబాటుదారులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించగలిగారు. ప్రజా సంప్రదింపుల గ్రూప్ అనే పీస్ కమిటీ ఏర్పాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. తాను మధ్యవర్తిని కాదని, పరిశీలకురాలిని మాత్రమేనని ఆమె చెప్పుకునేవారు. ది మోత్ ఈటెన్ హౌడా ఆఫ్ ఎ టస్కర్‌తో పాటు పేజేసే స్టెయిన్‌డ్ విత్ బ్లడ్, ది మ్యాన్ ఫ్రమ్ చిన్నమస్తా అనే అద్భుతమైన రచలను చేసి, సామాజిక పరివర్తనకు కృషి చేశారు. వర్డ్స్ ఫ్రమ్ ది మిస్ట్ అనే పేరుతో జహ్నూ బారువా ఆమె జీవిత కథను తెరకెక్కించారు.
చిన్ననాటి నుంచే ఆమెలో ఆత్మహత్య చేసుకోవాలనే విచిత్రమైన కాంక్ష ఉంటూ వచ్చింది. ఇది ఆమె ఆత్మకథ ది అన్‌ఫినిష్‌డ్ ఆటోబయోగ్రఫీ (అసంపూర్ణ ఆత్మకథ) ద్వారా తెలుస్తుంది. షిలాంగ్‌లో తన ఇంటికి దగ్గరగా ఉన్న క్రినోలైన్ జలపాతంలోకి దూకాలని అనిపించేదట. తన భర్త మాధవన్ రైసోమ్ అయ్యంగార్ ప్రమాదంలో మరణించడం ఆమెను విపరీతంగా కృంగదీసింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఆమె భర్త కాశ్మీర్‌లో కారు ప్రమాదంలో మరణించాడు. మొదట్లో రచనలు చేసి మానేసిన ఇందిరా గోస్వామి భర్త మరణం తర్వాత మళ్లీ రచనలు చేయడం ప్రారంభించారు. తన భర్త ఉద్యోగం చేసిన కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన అనుభవాన్ని ఆమె అహిరోన్, ది చెహ్నాబ్స్ కరెంట్ రచనల్లో చిత్రీకరించారు. పరిశోధకురాలిగా, రచయిత్రిగా ఆమె తన రచనల్లో అస్సామీ తిరుగుబాటు ఉద్యమాలను కూడా స్పృశించారు. ఆమె రాసిన కొన్ని రచనలు వివాదాలు సృష్టించాయి. ఓ సంపాదకుడు ఆమె ఘెరావ్ చేశాడు, ఆ తాంత్రికుడు బెదిరించాడు. ఆమె రాసి జాతర భారత ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మిలిటెంట్ ఉద్యమాలను ఇతివృత్తంగా తీసుకుని రాసింది. ఇది ఆమె రచనల్లో ప్రధానమైంది. రచనలు చేయకపోతే జీవించడం సాధ్యమయ్యేది కాదని భావించి రచనలు చేసిన ఇందిరా గోస్వామి అస్సామీ ప్రజలను వదిలేసి వెళ్లిపోయారు. ఆమె మరణం భారత సాహిత్యానికి కూడా తీరని లోటు. ఆమె ఆశించిన సమాజాన్ని సాధించడానికి కృషి చేయడమే ఆమెకు మనం అర్పించగల నివాళి.












Click it and Unblock the Notifications