వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథా నిర్మాణంపై రచయితల గోష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

story writers meet at Khuli kutubshaw tombs
కథా రచయితలు కొంత మంది హైదరాబాదు సమీపంలోని కులీ కుతుబ్‌షా చారిత్రక కట్టడాల మధ్య కథా నిర్మాణంపై, కథా విస్తరణపై ఇష్టాగోష్టి సమావేశం జరిపారు. ఆదివారం సెలవుపూట దస్కత్ కథా వేదిక ఆధ్వర్యంలో ఈ ఇష్టాగోష్టి జరిగింది. దాదాపు 15 మంది కథారచయితలు ఈ గోష్టిలో పాల్గొన్నారు. కథా పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్, కథా రచయితలు పసునూరి రవీందర్, హనీఫ్, స్కైబాబా, జూపాక సుభద్ర, పూడూరు రాజిరెడ్డి, ఆర్ రత్నాకర్ రెడ్డి, మురళీకృష్ణ, ఏనుగు నర్సింహా రెడ్డి, వేణుగోపాల్, వెంకట్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కథానిర్మాణంపై, అంటే శిల్పంపై దృష్టి పెట్టాలని కొంత మంది రచయితలు చేసిన సూచన పట్ల జూపాక సుభద్ర అభ్యంతరం చెప్పారు. దానివల్ల కొన్ని సామాజిక వర్గాల రచయితలకు అన్యాయం జరుగుతుందని, రాసినదాన్ని రాసినట్లు స్వీకరించాల్సిందేనని, వస్తువు మారితే ఆ సామాజిక వర్గాల అభివ్యక్తి దెబ్బ తింటుందని అన్నారు. అభివ్యక్తి మారడానికి అవకాశం లేదని, వస్తువు మారదని, పాఠకుడికి ఆసక్తి కలిగించే విధంగా నిర్మాణం ఉండడం అవసరమని డాక్టర్ కాసుల లింగారెడ్డి అన్నారు. జూపాక సుభద్ర వాదనతో స్కైబాబ కూడా ఏకీభవించారు. శిల్పమంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదని, అభివ్యక్తిలో అది ఒక భాగం మాత్రమేనని కొంత మంది అభిప్రాయపడ్డారు. కథ కథలాగా ఉండాల్సిన అవసరం ఉందని పూడూరు రాజిరెడ్డి అన్నారు.

తెలంగాణకు సంబంధించిన కథలతో ఒక సంకలనం తేవాలని, 1956 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ కథలతో ఈ సంకలనాన్ని ప్రచురించాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు. విశాలాంధ్రవాళ్లు తెచ్చిన తెలంగాణ కథా సంకలనానికి, కర్ర ఎల్లారెడ్డి యేటేటా తెస్తున్న కథా సంకలనాలకు భిన్నంగా ఉంటూ, వాటిలో లేని కథలను ఎంపిక చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

అవసరమైతే, దస్కత్ తరఫున ఓ త్రైమాసిక పత్రికను వెలువరించాలని నిర్ణయించుకున్నారు. పత్రిక ఎలా ఉండాలనే అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. దస్కత్ కార్యవర్గాన్ని విస్తరించుకున్నారు. కన్వీనర్‌గా పసునూరు రవీందర్, కో కన్వీనర్లుగా మురళీకృష్ణ, కాసుల లింగారెడ్డి ఎన్నికయ్యారు. మిగతా బాధ్యులను కూడా ఎంపిక చేసుకున్నారు. జిల్లా కన్వీనర్లను నియమించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది. కథా నిర్మాణంపై సమావేశంలో సీరియస్ చర్చ జరిగింది.

English summary
Daskat, forum for Telagana short story writers organised a meeting to discuss about Telangana stories. They decided to improve and rxpand the story writing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X