వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహితీవేత్త గిడుగు కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Gidugu Rajeswar Rao
న్యూఢిల్లీ: ప్రముఖ కవి, రచయిత గిడుగు రాజేశ్వరరావు (82) కన్ను మూశారు. శనివారం సాయంత్రం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఆయన ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గుండెపోటు రావడంతో మరణించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లోని శ్మశానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

వ్యవహారిక భాషోద్యమ నిర్మాత గిడుగు రామ్మూర్తి మనవడైన రాజేశ్వరరావు పూలతేరు, కాళిందిలో వెన్నెల, మల్లెపందిరి, గిడుగు రాజేశ్వరరావు కథలు మొదలైన కథా సంపుటాలను, భావవీచికలు, రాగవీచికలు వంటి గేయసంపుటాలను వెలువరించారు.

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జానకి, మోహన రాజు తదితరులు ఆయన రచించిన పాటలను పాడారు. పిల్లల కోసం గేయాలు, కథలు సైతం రాశారు. 'గిడుగురామ్మూర్తి జీవిత చరిత్ర'ను కూడా రాశారు. రాజేశ్వరరావుకు కూతురు స్నేహలత, కుమారుడు రామదాసు ఉన్నారు. రామదాసు ఢిల్లీలోనే రక్షణ శాఖలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తుండగా కూతురు స్నేహలత గాయనిగా, వైణికురాలిగా పేరొందారు.

కాగా గిడుగు రాజేశ్వరరావు మృతి పట్ల మాజీ ఎన్నికల కమిషనర్ జివిజి కృష్ణమూర్తి, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, నేషనల్ బుక్‌ట్రస్ట్ సంపాదకుడు పత్తిపాక మోహన్, రచయితలు జేఎల్ రెడ్డి, సంపత్‌కుమార్. బాలగంగాధర్ తిలక్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సాహితీ ప్రపంచానికి తీరనిలోటని కాళీపట్నం రామారావు (కారా) అన్నారు.

English summary
An eminent Telugu literary personality Gidugu Rajeswar Rao has passed away in Delhi with heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X