• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కథా సృజనశీలి సుజాతా రెడ్డి

By Pratap
|

Mudiganti Sujataha Reddy
ముదిగంటి సుజారెడ్డి ప్రాచీన కవిత్వాన్ని అధ్యయనం చేసి విశ్లేషించినవారు. తెలుగు నవలపై తెలుగు సాహిత్య చరిత్రపై పరిశోదనాత్మక గ్రంథాలు వెలువరించినవారు. శ్రీనాథుని కవితా సౌందర్యం, మను వసుచరిత్రల తులనాత్మకపరిశీలన అనే గ్రంథాలను వెలువరించారు. తెలుగు నవలాను శీలనం, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర అనే పుస్తకాలు కూడా రాశారు. తెలుగు సాహిత్య అధ్యయానాన్ని ప్రముఖం చేసుక్ను సుజాతారెడ్డి సృజనాత్మక వచన ప్రక్రియను చేపట్టడం ఒకరకంగా విచిత్రమే. సంకెళ్లుగా తెగాయి, మలుపు తిరగిన రథ చక్రాలు, ఆకాశంలో వభజన రేఖల్లేవు అనే నవలలు రాశారు. ఆ తర్వాత ఆమె కథారచనపై దృష్టి మళ్లించినజిట్లు కనిపింస్తుంది. రచనా వ్యాసంగం ప్రారంభించిన చాలా కాలానికి ఆమె కథారచనకు పూనుకోవడం ఇందుకు నిదర్శనం.

1990 థకంలో సృజనాత్మక వచన రచన ప్రారంభమైంది. ఇప్పుడు పుంఖానుపుంఖంగా కథలు రాస్తున్న రచయిత్రుల్లో సుజాతారెడ్డి ఒకరు. ఆమె క సంకలనాలు 'విసుర్రాయి' 'మింగేతున్న పట్నం' వెలువడ్డాయి. ఆమెకు ఇటీవల చాసో అవార్డు కూడా లభించింది. ఈ రెండు కథా సంకలనాల్లోని కథలను పరిశీలిస్తే ఆమె కథా పరిణామక్రమాన్ని గ్రహించడానికి వీవుతుంది. మొదటి థలో ఆమె స్త్రీ దృష్టికోణంతో ఫెమినిస్టు కథలు రాశారు. 'విసుర్రాయి' సంపుటిలోని కథలు చాలా వరకు ఫెమినిస్టు కథలే, 'విసుర్రాయి' అనేదే స్త్రీ జీవితానికి ప్రతీక. అయితే ఆమె ఎంఉకున్న ఇతి వృత్తాలు ఇతర ఫెమినిస్టు రచయితల ఇతివృత్తాలకు భిన్నమైనవి. ప్రస్తుత సామాజిక చట్రంలోనే మధ్యతరగతి, అట్టడుగు వర్గాల స్త్రీలు అణచివేతకు, వివక్షకు, అన్యాయానికి గురవుతున్న తీరును ఆమె విసుఆయి. సంకలనంలోని కథల్లో చిత్రించారు. కుటచింబ పరిధిలోవారు వివక్షకు అనాదరణకు గురవుతున్న తీరును సుజాతరెడ్డి కథల రూపంలో వ్యక్తీకరించారు. ఇతివృత్తాలు మాత్రం భిన్నమైనవి.

తరువాతి కతల విషయంలో సుజాతారెడ్డి ఆ పరిమితిని పాటించలేదు. భిన్న వస్తువులను తీసుకుని వర్తమాన సమాజం వికృత రూపాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపచేశాయి. ఈ కథలు 'మింగుతున్న పట్నం' కథనంలో కనిపిస్తాయి. వైవిధ్యభరితమైన వస్తువులను ఆమె తెలిసే ఎంపిక చేసుకునాఉ. ఈకథల్లో భూమి సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పల్లె భూముల సమస్య కాదు. పట్నాలకు పాకిన భూమి సమస్య అది. ఈ కొత్త రకం సమస్య నగరాల్లో సృష్టిస్తున్న విధ్వంసం ఆమె కతల్లో కనిపిస్తుంది. దానికి తోడు, పల్లెలో వ్యవసాయం కొనసాగక ఉన్న భూములను కోల్పోయి నగరాలకు బాట పట్టిన సన్నకారు రైతుల హృదయ విదారక దృవ్యాలు కనిపిస్తాయి. అటు పల్లెలు విధ్వంసమవుతూ, ఇటు నగరాలు మాఫియా గ్యాంగుల దౌర్యన్యాలతో విలవిలలాడుతున్న వర్తమాన నిశ్శబ్ద విధ్వంసాన్ని ఆమె కథలు చిత్రీకరించాయి. గణపతి విగ్రహం పాలు తాగడం దగ్గరి నుంచి కెరీరిజం మోజులో, అమెరికాలో వాలిపోవాలనే తపనగల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భార్యల వెతల వరకు వర్తమాన పరిణామాలేవీ ఆమె కథలను దాటి పోలేదు. స్థూలంగా సుజాతారెడ్డి కథల వస్తువుల వివరణ ఇది. సుజాతారెడ్డి అతి సాధారణమైన వస్తువులనే ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆమె దృక్కోణం ఆ కథలకు విశిష్టతను చేకూర్చి పెట్టాయి. ఆమె సమాజంలోని బలహీనుల పక్షాన కతను నడిపిస్తారు. ఆమె చెప్పదల్చుకున్న విసయం పాఠకులకు చేరడంల ఏ విధమైన గందరగోళం, అయోమయం ఏర్పడదు. సంక్లిష్టత కనిపించదు. స్పష్టంగా ఆమె ఉద్దేశించిన బావాలు పాఠకులను చేరుతాయి. ఈ ప్రతిభ కథనం వల్ల ఒనగూరింది. సుజాతరెడ్డి కథల వైలి నిరాంబడరం. రచయిత ఎక్కడా ప్రవేశించకుండా కథను నడిపిస్తారు. ఉపదేశాలు, ప్రసంగాలు మచ్చుకైనా కనిపించవు. పాత్రల మానసిక స్థితిని, ఆలోచనలను ఘర్షణను నేపధ్యాన్ని వర్ణించడం ద్వారా ఆమె కతకు చిత్రిక కడుతారు. క్లుప్తతను పాటించడం వల్ల ఆమె కతలకు ఒక బిగువు సమకూరింది.

సుజాతారెడ్డి కతలకు ఆది మధ్యంతాలు లేవు. మధ్యలో ప్రారంభమైన మధ్యలోనే ముగుస్తాయి. చాలా కథలు ధర్డ్‌ పర్సన్‌లో సాగుతాయి. అయిన్పటికీ రచయిత ఎక్కడ పడితే అక్కడ జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకోకపోవడం వల్ల రచయిత్రి తన ఉద్దేశ్యాలను తమపై రుద్దుతున్నారనే అభిప్రాయం పాఠకులకు కలగదు. ఒక రకంగా మౌఖిక లక్షణం ఆమె కథన పద్దతిలో వుంది. తనకు తెలిసిన విషయాలను తన అభిప్రాయాలను, ఉద్దేశాలను చేర్చకుండా ఎదుటి వారికి వినిపించే పద్దతి ఇది అయితే ఒక సంఘటన లేదా సంఘటనల సమాహారం కత కావడానికి అది సరిపోదు. ఆమె దృక్కోణం, పాత్రల చిత్రీకరణ, నేపత్య వర్ణన, ప్లాట్‌ ఆమె తీసుకున్న ఇతివృత్తాలను కథల స్థాయికి చేర్చాయి. సామాజిక చలనం, పరిణామ థలు పాఠకుడికి తన చుట్టూ జరుగుతున్న విషయాలను విశ్లేషించుకుని గుండెచెదిరే అనుభూతిని కలిగిస్తాయి. కరుణ రసాత్మకంగా కనిపించే ఆమె వర్వమాన సమాజ బీభత్సాన్ని కళ్లముందుంచుతాయి. ఎక్కువ కతలు అతి సాధారణమైన సంఘటనతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు విసుర్రాయి కత 'సక్కుబాయి తెల్లవారు జామున నాలుగ్గంటలకు లేస్తుంది. అని, గుడి సెలు! గుడిసెలు!కథ 'చీకటి పడింది. ఇంట్లో గ్యాసుతో వెలిగే బల్బులు వెలుగులు విరజిమ్ముతున్నాయి.అని ప్రారంభమయ్యాయి. చాలా వరకు ఇంతే సాధసీదాగా ఆమకతలు ప్రారంభమవుతాయి. కతను ఇంత మామూలుగా ప్రారంభించే సుజాతారెడ్డి ఆతర్వాత జీవితం లోతును తవ్వుతూ పోతారు. ముందుకు సాగుతున్న కొద్దీ భావం చిక్కబడుతూ వుంటుంది. పాత్రల ప్రవర్తన, సంభాషణల ద్వారా జీవితాల్లోని, సమాజంలోని చిక్కుముళ్ళను విప్పుతూ పోతారు. నిజానికి ఆమె 'మింగుతున్న పట్నం' సంకలనంలోకతల కాన్వాసు చాలా పెద్దది 'గుడిసెలు!గుడిసెలు!' కత కాన్వాసు హైదరాబాద్‌ శివారులోని వ్యవసాయ కుటుంబాలు ప్రభుత్వ చర్యల వల్ల భూమి కోల్పోవడం ఆ భూములకు నష్టపరిహారం రాకపోవడం నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యలయాల చుట్టూ తిరగడం, అదికారుల హామీలు నీటి మూటలేకావడం, వారు గుడిసెలు వేసుకుని కూలీలుగా, బిచ్చగాళ్ళుగా మారడం వరసగా చిత్రీకరిస్తుంది.

ఈ క్రమంలో ఒక మురికివాడ ఏర్పడే తీరును కల్లముందుంచారు. రచయిత్రి. అయితే ఈ థలన్నీ దాటే క్రమంలో అందులోని ఒక వ్యక్తే దళారీగా మారి, సంపన్నుడెలా అవుతాడో చెప్పుతారు రచయిత్రి. సమాజంలోని వికీతరూపాన్ని కల్ళముందుంచే క్రమంలో రచయిత్రి జోక్యం ఎక్కడ కనిపించకపోవడం, దృశ్యాలు రీళ్లు రీళ్ళుగా ముందుకు కదిలిపోవడం గమనిస్తాం. అడవి ర్యాం కత కడబీఆ అంతే హైదరాబాద్‌ నగరం శివార్లలో భూ విక్రయాల బాగోతం, రౌడీల దాదాల దౌర్జన్యం భూకబ్జాల తీరుతెన్నులను ఈ కథలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. నేడు జరుగుతున్న అన్నాయాలకు అక్రమాలకు నిలువు దోపిడీలకు ఈ కథ అద్దం పడుతుంది. అనందరావు పార్టీ ఇచ్చిడంటే ఏదో పెద్ద వివేషమే వుంటుంది. అని మొదలయ్యే రాజకీయ మంటు కథ పేదలకు అందాల్సిన ఫలాలను రాజకీయ నాయకులు కాజేసే కపటత్వాన్ని దృశ్య రూపంలోకళ్ళ ముందుంచి ఒళ్ళు జలదరింపజేస్తుంది.

ఆధునిక సమాజం నెత్తికెత్తుకుంటున్న విలువ ఇప్పుడు కేరీరిజం సాఫ్ట్‌వేర్‌ రంగం వకాల్తా పుచ్చుకున్న తర్వాత వ్యాప్తి మరింత పెరిగింది. 'నిశ్శబ్దం! నిశ్శబ్దం!!' కత ఈ కేరీరజం మోజులో పడిన ఆదిత్య అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు భార్య సుకన్య అనుభవంఇంచే మౌనవేదనను చిత్రీకరించారు. జానపద కథల పద్దతిలో ఈ కథను ప్రారంభించారు. రచయిత్రి ''అనగనగా ఒక రాజుకుమారి'' అంటూ ఈ కత ప్రారంభమవుతుంది. సుకన్య అనుభవించే వేదనకు ఆమె చేసే ఆలోచనలకు ఈ కథన పద్దతి బాగానప్పింది. భరించరాని నిశబ్దాన్ని అధునిక సమాజం తెచ్చిన కొత్త విలువల్లో వుండడం ఈ కథ ద్వారా తెలియజేశారు. రచయిత్రి ఆదిత్య అనే కంప్యూటర్‌ ఇంజనీరు తారు కొత్త ప్రాజెక్టును సంపాంధించి, ఆమెరికాకు వెళ్ళిపోవాలనే తపనలో పడి, భార్యను కేవలం కీలుబొమ్మగా చూసే తీరుకు ఈ కథ అద్ధం పడుతుంది. విలువలు మారినప్పటికీ స్త్రీల జీవితాల్లో మార్పు రాకపోవడాన్ని ఈ కథ తెలియజేస్తంది. నడవడి మాత్రమే కాకుండా స్పందనలు యాంత్రికమైన తీరు ఈ కథ ద్వారా ప్రస్ఫుటమవుతుంది. మధ్యలో భర్త అదేశానుసారం నడుచుకుంటూ, తన మనసును తనను పట్టించుకోని భర్త ప్రవర్తనను చిత్రీకరిస్తూ ''ఒంటి స్తంభం మేడలో నుంచి ఏ రాజకుమారుడు వచ్చి రక్షిస్తాడు తమను! సుకన్య మొదడు పగిలిపోయే ఆలోచనలు! ఆలోచనలు! ఆమె రక్తనాళాలు చిట్లిపోయే భయంకర నిశ్శబ్ధం! రాక్షసుని ఒంటి నలుపంతా గదిలో వ్యాపిస్తున్నది! వ్యాపిస్తున్నది! సుకన్య ఉక్కురి బిక్కిరయిపోయింది. ఆ కారు నిశ్శబ్ధంలో నిస్తబ్ధతతో వుండిపోయింది. నిద్రరాలేదు'' అంటూముగుస్తుంది. ప్రారంభానికి, ముగింపునకు మధ్య సమన్వయం సాదించి ఇతి వృత్తానికి ఏకరూపకతను సాధించారు. సుజాతరెడ్డి ఈ కథలో సుకన్య అంతరాంగ మన:స్థితి చిత్రీకరణ వల్ల ఈ కథ కొంత కవితాత్మకంగా నడిచింది. ఈ రకంగా మిగతా కథల కన్నాభిన్నంగా కనిపిస్తుంది.

విసుర్రాయి సంకలనంలోని కథల్లో దాదాపుగా అన్ని కథలు స్త్రీవాద దృక్కోణం నుంచి రాసినవే. అయితే, తెలంగాణ స్త్రీవాద కథలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర స్రాంతాల స్త్రీవాద కథలకు మధ్య గల మౌలికమైన తేడాను ఈ కథలు పట్టిస్తా. ఇతివృత్తి స్వీకరణలో ఈ తేడా కనిపిస్తుంది. చదువుకున్న మధ్య తరగతి పట్టణ స్త్రీల సమస్యలు తెలంగాణ ఫెమినిస్టు కతల ఇతి వృత్తాలు కాకపోవడం సుజాతారెడ్డి కథల్లోనూ కనిపిస్తుంది. విసుర్రాయి. సంపుటిలోని కథల తర్వాత రాసిన కతల్లో వస్తు వైవిధ్యం ఉన్నప్పటికీ ఆమె స్త్రీవాద దృక్కోణాన్ని వదులుకోలేదు. అంతర్లీనంగా అన్ని కథల్లోను స్త్రీవాదం ద్యోతకమవుతూనే వుంటుంది.

విసుర్రాయి సంకలనంలోని కథల్లో సంభాషణలకు మాత్రమే తెలంగాణ మాండలికాన్ని నేపథ్యాన్ని వాడిన సుజాతారెడ్డి మింగుతున్న పట్నం సంకలనంలోని కథల్లో దాన్ని మరింత బిగఉరివుగా, సందర్భోచితంగా వాడారు క్రమక్రమంగా ఆమె కథల కథన పద్దతి చిక్కబడుతూ రావడం చూస్తాం. సాధ్యమైనంత మేరకు కృత్రిమంగా తోచకుండా తెలంగాణ మాండలికాన్ని ఆమె వాడుకున్నారు. మరుగునపడిపోయిన ఎన్నో తెలంగాణపదాలు, పదబంధాలు, నానుడులు, వ్యక్తీకరణలు అలవోకగా వచ్చిపడినట్లు వుంటాయి వాతావరణ కల్పనకు తెలంగాణ మాండలిక భాష వాడకం దోహదం చేసింది. లేఖ కథన పద్ధతి, ఫస్ట్‌ పర్సన్‌ పద్దతిని కూడా సుజాతారెడ్డి వాడుకున్నారు. ఎక్కువగా కథలను థర్డ్‌పర్సన్‌లోనే నడిపాడు. మొత్తంమీద సుజాతారెడ్డి తన కథల్లో సృజనాత్మకవ్యాఖ్యాత పాత్ర పోషించారు. వర్తమాన సామాజిక వాస్తవికతకు ఆమె కతలు నిలువుటద్దాలు. ఆమె ఇంకా రాస్తూపోతే ఒక కాలం సామాజిక చరిత్రను ఆవ ుకతల ద్వారా నిర్మించవచ్చు. గాబ్రియెల్‌ గ్రేసియా మార్క్వజ్‌ తన grandmother గురించి ఇలా అంటాడు. ..''she used to tell me about the most atrocious things with out turning a hair, as if it was some thing she'd just seen.'' సుజాతారెడ్డి అచ్చంగా కథలు అలాగే చెప్పారు, రాశారు.

- కాసుల ప్రతాపరెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mudiganti Sujataha Reddy, a prolific writer in Telugu, narrates stories as seen and experienced. She wrote many short stories, which depicts human life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more