రాంగ్ ఎస్సెమెస్స్
మొదట
నోటికి చెవికి సంభాషణ
తుంపర తుంపరగా ప్రారంభం
కంప్యూటర్ లో
అక్షరాలను పొందిచ్చి
పదాలు వాక్యాలు పోతబోసి
ఫ్లాష్ ఫ్లాష్ మెరుపులు ఉరుములు
ఎక్కడో
నాలుగ్గోడల మధ్య
వికృత విశృంఖల విన్యాసం విప్పుకుంటే
కండ్లు పొడుచుకొని
చెరువులు కొరుక్కుని తినేటట్లు
చిన్న కథలా
క్లిప్పింగులు క్లిప్పింగులు అతుకుతూ...
ప్రవాహంగా ప్రసారం
ఎల్లో జర్నలిజం దాహాన్ని
బాటిళ్ల చొప్పున తాగిన మైకం
దొంగతనం, రేప్, హత్య
ర్యాగింగ్, ఆత్మహత్య..
వాటర్ ట్యాంక్ ఎక్కినంత అలుకగా
విశ్లేషణాత్మక కథనాలు
అచేతనంగా వున్న
ఆశలకు కోరికలకు మత్తెక్కించి
మనస్సులో
దుర్బుద్ధి రెపరెపలు
ఒక ప్రేరణగా
ఒక ఉత్ప్రేరకంగా
చరిత్ర పేజీల గురుగుల్లో అపక్షేపంగా
మళ్లీ... ఒక వార్తా
చల్లారని గాయంగా
సంధించడం ఆవిష్కరించడం












Click it and Unblock the Notifications
