సందేశం (హం?)
బాంధవ్యాలు కడిగేయకు మరబందూకులతో,
బందూకుల న్యాయం కోరితే,
రాజైనా ఒకటే, రాక్షస రాబందైనా ఒకటే
మనిషి కాదోయి నీ లక్ష్యం,
మానవతే నీ మహాలక్ష్యం,
రుధిర ధారల రుద్రభూమిలో
ఆదరణెక్కడిది, ఆది తప్ప
విషం చిమ్మకు వీరి వానిల్లు సీమలో
అమృతం కురిపించు అఖండ సీమలో
విశ్వసించు మానవతా విలువల్ని
వినిర్ముక్తము విశృంఖల భోగాలు
అంబరం చుంబించిన విజ్ఞానం
అధో పాతాళాన్ని కూడా తవ్వుతుంది
మృగం నుండి మనిషి పుట్టింది జీవపరిణామం,
మనిషి నుండి మృగం పుడుతుంది,
ఇది సజీవ సత్యపరిణామము
ధనరహితుడు దరిద్రుడు
మౌనరహితుడు...
పరమ దరిద్రుడు
స్వతంత్రమంటే విచ్చలవిడి తనం కాదు,
స్వరాజ్యమంటే
పొరుగువాడిపై రాయి వేయడం కాదు
నాగరికతలు పురోగమనానికే కాదు
తిరోగమనానికి అద్దం పడతాయి
ఇక చాల్లే
ఎందుకీ
అఘోషం












Click it and Unblock the Notifications