వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమయం ఒకటే - సందర్భాలు నాలుగు

కరెంట్ కోతా
కాదేమో
ఇంటి దీపం ఊరెళ్లింది -
వీధి వీధంతా దుర్గంధం
మునిసిపాలిటీ పడకేసిందా
కాదు.. కాదు
రాజకీయ సభ జరుగుతోంది -
ఆకాశం ఏడుస్తోంది
అకాల వర్షమా
కాదనుకుంటా..
వీరుడు ఉరి తీయబడ్డాడు -
తోటలో కోయిల గానం
మారాకు లేకుండానే
వసంతం వచ్చిందా
పిల్లలు చెట్టల్ల చేరారు -