తల్లి గోదారి

రోజు తనకు పిండాలనే తిండి పెట్టే
పంతులు పరమపదించాడు
వాడి ఆత్మ శాంతికై
కాటన్ దొరతో చెప్పి
ఒడ్డునున్న ప్రజలందరికీ
అన్న దానం చేయించింది
విరగబడి ప్రజలు విందారగించారు
మిగతా నదులన్నిటి స్థితి ఇలాగే
పంతులు పిల్లలు దిక్కు లేక
దీనంగా చావలేక బ్రతుకీడుస్తూ
మంచి చదువులు చదివి
పిండాల చదువు రాక
వేరే ఉద్యోగం లేక
దీనంగా గోదారి చేరారు
ఓ పిల్లలారా మీ కష్టాలకు
ధనసాయం చేస్తే చెతకాని వాళ్ళలా
మిగులుతారు
లెండి మీరంతా ఏకం కండి
విప్లవ మూర్తులై ఉద్యోగ విద్యా సాధనలో
రిజర్వేషన్లు చేయించుకోమని
తల్లి గోదారి ఉప్పెనతో పిలుపునిచ్చింది












Click it and Unblock the Notifications