జూకంటి కవిత బృందగానం

చినుకులుగా కురిసి
సవ్వడిగా కలెకలిసి
చెరువును కరువు తీరా
నిండు పొద్దుగల గర్భవతిని చేసింది
కాలువ
తూము తీయగానే
మెరిసే వెండి అంచు
జల శాలువాను కప్పుకు
పంట పొలాల వైపు
రికామిగా పరుగు తీసింది
బీడు
నాగలితో జత కట్టి
వరి నాటుతో తరించి తరి పొలమైంది
మనిషి
కమనీయ దృశ్య ముదురు కలుపు
బృంద గాన గాంధర్వుడయ్యాడు
- జూకంటి జగన్నాథం












Click it and Unblock the Notifications