టి. లలితా ప్రసాద్ కవితలు

A poem by Lalitha Prasad
పిలువు

వెనక్కి తిరిగి చూస్తుంది
వెక్కిరిస్తుంది
కొన్ని పదాల పిట్టలు, కొన్ని పంక్తుల దొంతర్లూ
తలుపు తట్టిన ప్రతిసారీ
ఎవరి నిశీధ గీతమో, ఎవరెవరి ఆలాపనో
కలల వంతెన మీదికి పిలిచి
బాల్యం అలల సవ్వడి వినమంటుంది!
ఎవరు పిలిచారో
నది వెనక్కి తిరిగి చూస్తుంది!

కన్ఫెషన్

ఇలా అవుతందనుకోలేదు
ఎలా అయ్యేదో తెలీదు
ఇంత దూరం వచ్చాక
తప్పే దారి అడగటం!
వెను దిరిగి చూస్తే
వెంటాడే స్నేహితుడ్ని నేనే
ప్రయాణం అంతర్ముఖం!
హాయిగా నవ్వుకుంటున్నా
నన్ను చూస్తూ నేను!

నీటి సేవ

నీటికి కోపం వస్తుంది
చన్నీటికి విసుగొస్తుంది
ఇసుక మీగడ కబళించేస్తుంటే
కదం తొక్కదా నీటి సేన!
మనిషి ఆగ్రహం క్షణికం
తరాల ఆనవాలు
చన్నీటి సేన ఆగ్రహం!

నిజమే

ఏ కలయికా వదలదు
ఏ సంఘటనా విడవదు
యాత్రలో కటువుగా, మెల్లగా
వొడిలోకి లాక్కుంటాయి, వదలనంటాయి
భ్రమ చిత్రం రంగులు వెలిసిపోతాయి
కొన్ని వూసులు, కొన్ని చిత్రాలే
ఇంకుతాయి మనసులోకి!

గాటు

నీటికి వస్తుంది
తీరని కోర్కెలా మరణం
ఆనందపు తెర చాటుతుంది
యుగాల సహనం భరించి
చేర్చుకుంటుంది అనంత ప్రేమతో
ఈ బంధాలు, బాధలూ, బాల్యం...?
లెక్కలేసుకునే చిట్టా కాదు జీవితం!

సొట్యూషన్

తెరలు కట్టుకుని వున్నాం
పేర్లూ, మాటలతో
మాటల కత్తితో విభజించుకుంటున్నాం
చట్రంలోంచి బయటపడాలనే యత్నం
వాళ్లు, వీళ్లూ, ఆనవాళ్లూ, అభిప్రాయాలూ
నీకూ, నాకూ మధ్య ... అన్నీ అంతా!
మరణ నివాసానికి దారి తీస్తాయి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+