లలితా ప్రసాద్ కవిత 'ప్రయాణం'

Lalitha Prasad
యేటిలోకి గాలం విసిరితే
గాలంతో యేటినే లాగుతోన్నట్టుంది
తెల్లారినుంచీ అతనూ ఓ రాయే
వూరు, ఇల్లు, తనవాళ్లూ
యెన్ని వూసులతో గాలం లాగుతోన్నా
తాను మౌని, ముని, కరుణాత్ముడూ
నవ్వుకుంటున్నాడు నిమ్మళంగా
పయనిస్తూ తనలోకి!

2
ఎన్నయినా చెప్పు
ఎవర్నయినా వినూ
సాములు, ఆసాములు
చివర్న నీడతోనే చర్చ

3
నాలోకి చూస్తుంటానా
ఎంత నిర్మానుష్యం
చొక్కా విప్పేస్తే..

4
ఎవరో లాగినట్టు పోతుంది నావ
అవసరాలు, ఆలోచనలూ తాళ్లుపేనినా
దుర్బర, దౌర్బల్య వలల పక్కగా
తోసుకుపోతూంటుంది!

5
నన్ను వెతుక్కుంటానా
నా అడుగులే నాకు విసిగేస్తుంది
కొన్ని వూసులు, మరికొన్ని కన్నీళ్లు
అలలై నావని చుట్టేస్తాయి

6
బడి వొదిలేసినా
చెట్లనీడల్లా పరచుకున్నాయి
స్నేహాలు స్వచ్ఛంగా
జీవనయానమంతా!

7
దారి తప్పిస్తుంటాయి అన్నీ
అన్నీ డొల్లలే...
పలకరింపులు, నవ్వులు
మనసు కన్నీళ్లతో కావలించుకుంటుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+