Apple: యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. లాంచ్‌కు ముందే పేరు, ధర లీక్!

Apple: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ నేడు రాబోతోంది. నేడు జరగనున్న 'సర్ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్లో యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను ఆవిష్కరించనుంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌కు ' ఐఫోన్‌ డ్యూయో' అని పేరు పెట్టినట్లు సమాచారం. ఈ లాంచ్‌తో యాపిల్ సంస్థ అధికారికంగా ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

డస్ట్‌బిన్లు లేవు.. చెత్త లేదు.. ఇదే దేశంలో క్లీనెస్ట్ విలేజ్!
డస్ట్‌బిన్లు లేవు.. చెత్త లేదు.. ఇదే దేశంలో క్లీనెస్ట్ విలేజ్!

ఈ ఐఫోన్ డ్యూయో బుక్ తరహా డిజైన్‌తో రానుంది. ఇందులో 5.5 అంగుళాల బయటి స్క్రీన్, 7.8-అంగుళాల భారీ లోపలి స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ యాపిల్ లేటెస్ట్ ఏ20 ప్రో చిప్ సెట్‌తో పనిచేస్తుందని.. ఫేస్ ఐడీకి బదులుగా సన్నని డిజైన్ కోసం టచ్ ఐడీని అందించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఐఫోన్ చరిత్రలోనే తొలిసారిగా ఈ మోడల్ 'యాపిల్ పెన్సిల్' సపోర్ట్‌తో రానుండటం విశేషం. ఇది ప్రారంభంలో కేవలం ముదురు నీలం, తెలుపు రంగులలో మాత్రమే లభించనుంది.

Apple Foldable iPhone Duo Name Price and Specifications Leaked Ahead of Launch Full Details

ధరల విషయానికొస్తే.. ఈ ఫోల్డబుల్ ఫోన్ యాపిల్ లైనప్‌లోనే అత్యంత ఖరీదైన పరికరంగా నిలవనుంది. 256జీబీ బేస్ వేరియంట్ ధర దాదాపు 2 వేల డాలర్లు అంటే ఇండియాలో లక్షా 65 వేల కంటే ఎక్కువ నుంచి ప్రారంభమవుతుందని అంచనా. ఇక 2టీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర 3 వేల డాలర్లు అంటే ఇండియా 2 లక్షల 85 వేల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. విడిభాగాల ధరలు పెరగడమే ఈ భారీ ధరకు కారణమని సమాచారం. ఈ రోజు రాత్రి ఫోన్ లాంచ్ కానున్నప్పటికీ.. దీని ఉత్పత్తిలోని సంక్లిష్టత దృష్ట్యా వినియోగదారులకు అక్టోబర్ నెలలో అందుబాటులోకి రానుంది.

టీమిండియాలోకి బేబీ బాస్ ఎంట్రీ.. భారత్-ఆఫ్ఘన్ టీ20 పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే?
టీమిండియాలోకి బేబీ బాస్ ఎంట్రీ.. భారత్-ఆఫ్ఘన్ టీ20 పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే?

ఈ ఈవెంట్లో ఐఫోన్ డ్యూయోతో పాటు యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లను కూడా లాంచ్ చేయనుంది. వీటితో పాటు కొత్త ఎయిర్‌పాడ్స్ 5, అలాగే హెల్త్, ఏఐ ఫీచర్లతో కూడిన యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4లను ఆవిష్కరించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+