భర్తకు భావోద్వేగంతో సెండాఫ్
ISRO: అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కొద్దిసేపటి కిందటే నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్.. అంతరిక్ష కేంద్రం వైపు దూసుకెళ్లింది.
ఈ మిషన్ పేరు.. యాక్జియమ్ 4. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములను తీసుకెళ్లడానికి ఇస్రో.. ఈ మిషన్ ను చేపట్టింది. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారాన్ని తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ ఈ మిషన్ కు నేడు ముహూర్తం కుదిరింది.

కొద్దిసేపటి కిందటే అంటే.. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:01 నిమిషాలకు అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ఐఎస్ఎస్ కు దూసుకెళ్లింది. దీనికోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ను వినియోగించారు. ఈ రాకెట్ లో వాళ్లంతా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు.
ఈ మిషన్ కు భారత్ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్నారు. ఆయనతో పాటు స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్.. ఐఎస్ఎస్ కు వెళ్లారు.
మొత్తం ఏడు అంశాలపై శుభాన్షు శుక్లా టీమ్ పరిశోధనలు సాగిస్తుంది. ఈడిబుల్ మైక్రొయాలజీ, స్ప్రౌట్స్, మజిల్ రీజనరేషన్, టర్డిగ్రేడ్స్, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే, సైనో బ్యాక్టీరియా, ఫుడ్ క్రాప్ సీడ్స్.. పై ఈ పరిశోధనలు ఉంటాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
గ్రూప్ కెప్టెన్ శుక్లా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్ 39-Aకి వెళుతున్న సమయంలో వందేమాతరం గీతాన్ని ప్లే చేయడం ఆకట్టుకుంది. అంతకుముందు భార్య డాక్టర్ కామ్నా మిశ్రాను ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు శుభాన్షు శుక్లా. ఆమె తోడు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదని అన్నారు.
ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ మిషన్ లో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని కోరుకుంటోన్నానని అన్నారు. ఈ ప్రయాణంలో భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులు పునాదిగా నిలిచారని పేర్కొన్నారు. తన కోసం త్యాగం చేశారని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications