మోస్ట్ డేంజరస్ స్నేక్స్- కాటేస్తే.. క్షణాల్లో కీర్తిశేషులమైపోతాం

Most Dangerous Snakes in the World: అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో 3,000 కంటే ఎక్కువ పాము జాతులు ఉన్నాయి. వీటిల్లో అత్యంత విషపూరితమైనవి.. 300 కంటే తక్కువే. అందులో కూడా సగం వరకు మాత్రమే మనుషులను చంపడానికి కావాల్సినంత అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉన్నాయి. వాటిల్లో కూడా మోస్ట్ డేంజరస్ పాములపై రెయిన్ ఫారెస్ట్ ట్రస్ట్ వెబ్ సైట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

1. సా-స్కేల్డ్ వైపర్: ఈ రకం పాములు మహా ప్రమాదకరం. ఆఫ్రికా, అరేబియా, నైరుతి ఆసియాలోని సవన్నాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి పరిమాణం చాలా చిన్నది. పూర్తిగా ఎదిగిన తర్వాత కూడా ఒకటి నుండి మూడు అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటాయి ఇవి.

సాధారణంగా గ్రే, గోధుమ లేదా నారింజ రంగుల్లో ఉంటాయి ఈ వైపర్స్. వీటిపై నల్లటి మచ్చలు ఉంటాయి. సా-స్కేల్డ్ వైపర్‌లు దూకుడు స్వభావం కలిగి ఉంటాయి. భయపడినప్పుడు అవి తమ పొలుసులను రుద్ది బుసకొడుతున్నట్లు శబ్దం చేస్తాయి. ప్రమాదం అని అనిపించిన వెంటనే కాటు వేస్తాయి.

ఈ సరీసృపాలు విషపూరితమైనవి. కాటు వేసిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. సా-స్కేల్డ్ వైపర్‌లు కనిపించే ప్రాంతాల్లో లో, ఈ జాతి కాటు కారణంగా మరణించే వారి శాతం అధికం. సా-స్కేల్డ్ వైపర్ నుండి సేకరించిన విషాన్ని టిరోఫిబాన్ వంటి ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

2. ఇన్‌ల్యాండ్ టైపాన్: ఈ రకానికి చెందిన పాముల విషంలో న్యూరోటాక్సిన్స్, ప్రొకోగ్యులంట్స్, మయోటాక్సిన్స్ మిశ్రమం ఉంటుంది. ఇవి పాము కాటుకు గురైన వ్యక్తి కండరాలను పక్షవాతానికి గురిచేస్తాయి. రక్త నాళాలు, కణజాలాలలో రక్తస్రావం కలిగిస్తాయి. శ్వాసను నిరోధిస్తాయి. కండరాలను దెబ్బతీస్తాయి.

ఇన్‌ల్యాండ్ టైపాన్ విషం ప్రపంచంలోని ఇతర పాముల కన్నా చాలా శక్తివంతమైనదని చెబుతారు. ఈ సరీసృపం ఒకసారి కాటు వేస్తే వందకు వంద చనిపోతారని నమ్ముతారు. ఆస్ట్రేలియా నుండి న్యూ గినియా వరకు ఈ రకం పాములు కనిపిస్తాయి. ఇవి లేత/ ముదురు గోధుమ రంగులో ఉంటాయి. దాదాపు ఎనిమిది అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి ప్రధానంగా ఎలుకలను తింటాయి.

3. కింగ్ కోబ్రా: కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన విషపూరితమైన పాముల్లో ఒకటి. ఇవి 18 అడుగుల పొడవు వరకు పెరుగుతాయని చెబుతారు. ఆకుపచ్చ, పసుపు లేదా నలుపు రంగులో ఉండే సరీసృపం ఇది. తలపై పెద్ద పొలుసులు ఉండటం వల్ల ఇతర పాము జాతుల నుండి చాలా భిన్నంగా కనిపిస్తుంది.

కింగ్ కోబ్రాలు సాధారణంగా మనుషుల జోలికి పోవు. వాటికి హాని కలిగించాలని భావిస్తే వదిలిపెట్టవు. ఈ పాము విషం ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే.. దీని కాటుకు గురైన ఓ ఏనుగు మూడు గంటల్లో చనిపోగలదు. అడవుల విధ్వంసం కారణంగా కింగ్ కోబ్రాను అంతరించిపోతున్న జాబితాలోచేర్చారు.

4. బ్యాండెడ్ క్రైట్: బ్లాక్ అండ్ వైట్ లేదా, బ్లాక్ అండ్ ఎల్లో రంగుల్లో ఉండే ఈ రకం పాములు చాలా విషపూరితమైవి. కోబ్రా జాతికి చెందినది. ఈ పాము థాయ్ లాండ్, ఆసియాలోని చాలా ప్రాంతాలలో అడవులు లేదా బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తుంది. బ్యాండెడ్ క్రైట్ విషం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. దీని విషంలో పక్షవాతానికి కారణమయ్యే న్యూరోటాక్సిన్‌ను ఉంటుంది.

5. టైగర్ స్నేక్: దాదాపు మూడు అడుగుల పొడవు ఉండే టైగర్ స్నేక్ తోక భాగంలో ముదురు గోధుమ లేదా పసుపు-గోధుమ రంగు చారలు ఉంటాయి. ఈ సరీసృపాలు ప్రధానంగా కప్పలను తింటాయి. టైగర్ స్నేక్స్ ఆస్ట్రేలియా ఆగ్నేయ తీరం వెంబడి.. తరచుగా వాగులు, నదులు లేదా చిత్తడి నేలల సమీపంలో కనిపిస్తాయి. టైగర్ స్నేక్స్ చాలా విషపూరితమైనవి. వాటి కోరలు 3-5 మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయి.

6. బూమ్‌స్లాంగ్: బూమ్‌ స్లాంగ్ రకం పాములు ఏమార్చగలవు. అదే దీని ప్రత్యేకత. అలా మభ్యపెట్టి ఆహారాన్ని సేకరిస్తాయి. ఊసరవెల్లి, పక్షులు లేదా ఇతర జంతువు తమ సమీపానికి వచ్చినప్పుడు మెరుపు వేగంతో దాడి చేస్తాయి. వాటిని ఆహారంగా స్వీకరిస్తాయి. బూమ్‌ స్లాంగ్ విషం రక్తస్రావానికి కారణమవుతుంది.

7. బ్లాక్ మాంబా: ఆఫ్రికాలో అత్యంత ప్రాణాంతకమైన పాముగా గుర్తింపు ఉంది బ్లాక్ మాంబాకు. వెంటనే చికిత్స అందించకపోతే వందశాతం మరణించడం ఖాయం. బ్లాక్ మాంబా సాధారణంగా ముదురు గోధుమ లేదా బూడిద రంగులో ఉంటుంది. దాని నోటి లోపలి భాగం నల్లగా ఉంటుంది. అందుకే దీనికి బ్లాక్ మాంబా అని పేరు వచ్చింది. ఈ సరీసృపాలు ఆఫ్రికాలోని సబ్-సహారా ప్రాంతంలో కనిపిస్తాయి. దాదాపు ఎనిమిది అడుగుల పొడవు వరకు ఉంటాయి. బ్లాక్ మాంబా గంటకు 12 మైళ్ళకు పైగా వేగంతో కదలగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+