చంద్రుడి అవతలి రహస్యాల ఛేదన దిశగా నాసా- నిప్పులు చిమ్ముతూ జాబిల్లి వైపు

అమెరికా అంరిక్ష పరిశోధన సంస్థ నాసా.. అయిదు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత మానవ సహిత చందమామ యాత్రను చేపట్టింది. ఆర్టెమిస్-2 మిషన్ ను ప్రయోగించింది. మొత్తం నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ రాకెట్ ఈ తెల్లవారు జామున సరిగ్గా 4:04 నిమిషాల సమయంలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఆ కొద్దిసేపటికే వ్యోమగాములు విజయవంతంగా తొలి కక్ష్యలోకి ప్రవేశించారు.

చంద్రుడి అవతలి వైపునకు..

చంద్రుడి అవతలి వైపునకు వెళ్తుందీ టీమ్. ఈ నలుగురిలో ఓ మహిళ ఉన్నారు. అలాగే తొలి నల్లజాతీయుడూ ఉన్నారు. తొలి కెనడియన్ వ్యోమగామి కూడా ఇందులో భాగం అయ్యారు. 50 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నాసా విజయవంతంగా నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపింది. మొత్తం 10 రోజుల పాటు ఈ యాత్రకు సాగుతుంది. చంద్రుడి మీద ల్యాండింగ్ కాకుండానే వీరంతా భూమికి తిరిగి వస్తారు.

Historic lunar mission New era of exploration 4-astronaut team Destination as NASA back to the Moon

అర్ధ శతాబ్దం విరామం..

అర్ధ శతాబ్దం విరామం అనంతరం మానవులు చంద్రుడిపైకి ప్రయాణించడం ఇదే తొలిసారి. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాసా స్సేస్ లాంచ్ సిస్టమ్ పై అమర్చిన ఓరియన్ అంతరిక్ష నౌక గర్జిస్తూ చంద్రుడి వైపు దూసుకెళ్లింది. ఆర్టెమిస్-2 మిషన్, నాసా చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత చంద్ర యాత్ర ఇది. దీనికి రీడ్ వైస్‌మ్యాన్ నాయకత్వం వహిస్తున్నారు.

స్పేస్ లాంచ్ సిస్టమ్..

అత్యంత శక్తివంతమైన రాకెట్లలో ఒకటైన స్పేస్ లాంచ్ సిస్టమ్, కెనడీ స్పేస్ సెంటర్‌లోని చారిత్రాత్మక లాంచ్ ప్యాడ్ నుండి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:04 గంటలకు బయలుదేరింది. ఎనిమిది నిమిషాల తర్వాత ఒరియన్ క్యాప్సూల్ రాకెట్ నుండి వేరుపడింది. మొదటి రోజంతా వ్యోమగాములు భూ కక్ష్యలోనే పరిభ్రమిస్తుంటారు ఈ సమయంలో వారు కీలక వ్యవస్థల తనిఖీ, చంద్రుని వైపు ప్రయాణానికి అవసరమైన సన్నాహకాలను చేపడతారు.

రోజంతా ఇక్కడే..

కీలకమైన ప్రొపల్షన్, నావిగేషన్, లైఫ్ సపోర్ట్ వంటి ముఖ్యమైన వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ధృవీకరించడానికి ఒరియన్ అంతరిక్ష నౌక భూమి చుట్టూ కక్ష్యలో ప్రయాణిస్తుంది. ఈ దశలో మిషన్ కంట్రోలర్లు ఓరియన్ సర్వీస్ మాడ్యూల్ ఇంజిన్‌ను ఉపయోగించి కీలకమైన పెరిజీ-రైజింగ్ బర్న్‌ను నిర్వహిస్తారు. ఇది అంతరిక్ష నౌక సురక్షితమైన మార్గంలో ఉందని, అవసరమైతే భూమికి తిరిగి రావడానికి వీలు కల్పించడాన్ని ఖరారు చేస్తుంది.

నాలుగు గంటల నిద్ర..

ఓరియన్ విస్తీర్ణం తక్కువ కావడం వల్ల క్రూ సుమారు నాలుగు గంటల చొప్పున రెండు షిఫ్టులలో నిద్రపోతారు. గ్రౌండ్ స్టేషన్ అంతరిక్ష నౌక వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. మొదటి రోజు ముగిసే నాటికి ఓరియన్ స్థిర కక్ష్యలోకి చేరుకుంటుంది. ప్రయోగ తేదీ నుంచి నాలుగు రోజుల తర్వాత ఆర్టెమిస్ 2 చంద్రుడిని చేరుకుంటుందని అంచనా. చంద్రుడి వైపు ఇప్పటివరకు అపోలో 13 కూడా వెళ్లని ప్రత్యేకమైన మార్గంలో వెళ్తుంది ఓరియన్.

'8' ఆకారపు లూప్‌..

ఇది అంతరిక్షంలో '8' ఆకారపు లూప్‌ను ఏర్పరుస్తుంది. రెండో రోజు కీలకమైన ట్రాన్స్‌ లూనార్ ఇంజెక్షన్ బర్న్ తర్వాత, ఒరియన్ అంతరిక్ష నౌక భూమి కక్ష్యను విడిచిపెట్టి, చంద్రుడి వైపు అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఫ్రీ-రిటర్న్ ట్రాజెక్టరీలో పయనిస్తుంది. ఈ నాలుగు రోజుల ప్రయాణంలో వ్యోమగాములు ఒరియన్ కీలక వ్యవస్థలను భవిష్యత్ అవసరాల కోసం రియల్ టైమ్ డేటాను రికార్డు చేస్తారు.

అంగారక గ్రహానికి..

సుదూర అంతరిక్ష వాతావరణంలో ప్రొపల్షన్, నావిగేషన్, లైఫ్ సపోర్ట్ వంటివి ముందుగా అంచనా వేసిన విధంగానే పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకుంటారు. తక్కువ భూ కక్ష్యకు మించిన పరిస్థితులకు మానవ శరీరం ఎలా ప్రభావం చూపుతుందనే దానిపై వ్యోమగాములు విలువైన డేటాను సేకరిస్తారు. ఇది తదుపరి ప్రయోగాలు, అంగారక గ్రహం వంటి సుదీర్ఘ మిషన్‌ ప్రణాళికలను రూపొందించడానికి అవసరమౌతుందని నాసా భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+