INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..

"శబ్ద నహి శక్తి హై, అరిదమన్!" (శబ్దం కాదు.. శక్తి, అరిదమన్!) అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ తన మూడవ స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (SSBN) 'ఐఎన్‌ఎస్ అరిదమన్' (INS Aridhaman) ను శుక్రవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టింది.

విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ (SBC)లో జరిగిన ఈ కమిషనింగ్ వేడుకతో భారత్ తన 'అణు త్రయాన్ని' (భూమి, గాలి, సముద్రం నుంచి అణు దాడులు చేసే సామర్థ్యం) మరింత పటిష్టం చేసుకుంది.

అరిహంత్, అరిఘాట్ సరసన అరిదమన్..

భారతదేశ అత్యంత రహస్య రక్షణ ప్రాజెక్టులలో ఒకటైన SSBN కార్యక్రమంలో అరిదమన్ చేరిక ఒక కీలక మైలురాయి. ఇప్పటికే సేవలు అందిస్తున్న ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాట్ సరసన ఇప్పుడు అరిదమన్ చేరింది. గత డిసెంబర్‌లోనే నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి సూచించినట్లుగా, అన్ని రకాల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి, ఇప్పుడు హిందూ మహాసముద్రంలో భారత పహారాను మరింత కట్టుదిట్టం చేయనుంది.

అగ్రరాజ్యాల సరసన భారత్..

అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములను సొంతంగా నిర్మించి, నిర్వహిస్తున్న అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ మరియు చైనా వంటి ఎంపిక చేసిన దేశాల క్లబ్‌లో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అరిహంత్ తరగతికి చెందిన ఈ జలాంతర్గాములు శత్రువుల కంటపడకుండా సముద్ర గర్భంలో నెలల తరబడి మునిగి ఉండగలవు. ఇది శత్రు దేశాల నుంచి అణు దాడి ఎదురైతే, సముద్రం లోపలి నుంచే దీటుగా బదులిచ్చే 'సెకండ్ స్ట్రైక్' సామర్థ్యాన్ని భారత్‌కు కల్పిస్తుంది.

India Commissions INS Aridhaman Third Nuclear Ballistic Missile Submarine Joins Navy in Vizag Ceremony

భవిష్యత్తు లక్ష్యం.. న్యూక్లియర్ సబ్ మెరైన్ (SSN)

భారత నౌకాదళం కేవలం ఇక్కడితో ఆగడం లేదు. అరిహంత్ తరగతి కంటే పెద్దవిగా, మరింత అధునాతనంగా ఉండే నాలుగవ, ఐదవ సబ్ మెరైన్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, పూర్తి స్వదేశీ అణు దాడి జలాంతర్గామి (SSN) ని 2036-37 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

సవాళ్లు - ప్రణాళికలు

1999లో రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం 2030 నాటికి 24 సంప్రదాయ జలాంతర్గాములను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఆరు మాత్రమే సేవల్లోకి వచ్చాయి. ఈ జాప్యాన్ని అధిగమిస్తూ, అణు సామర్థ్యం గల జలాంతర్గాములను వేగంగా నిర్మిస్తుండటం భారత రక్షణ వ్యూహకర్తల దూరదృష్టికి నిదర్శనం. అరిదమన్ రాకతో ఇకపై భారత జలసరిహద్దుల్లోకి అడుగుపెట్టాలంటే శత్రువు వందసార్లు ఆలోచించాల్సిందే!

అరిధమన్‌తో అజేయంగా మారనున్న నౌకాదళం!

దాదాపు 7,000 టన్నుల బరువుతో, 130 మీటర్ల పొడవైన హల్ (Hul) రూపకల్పనతో ఇది భారీ క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇందులో అమర్చిన 83 మెగావాట్ల ప్రెషరైజ్డ్ లైట్-వాటర్ రియాక్టర్ దీనికి అపరిమితమైన శక్తిని ఇస్తుంది. ఇది సముద్రం అడుగున 24 నాట్ల వేగంతో నిరంతరాయంగా ప్రయాణించగలదు.

రెట్టింపైన దాడి సామర్థ్యం: ఎనిమిది లాంచ్ ట్యూబ్‌లు!

అరిధమన్‌లోని అతిపెద్ద ప్రత్యేకత దాని వర్టికల్ లాంచ్ సిస్టమ్ (VLS). పాత జలాంతర్గాముల్లో నాలుగు లాంచ్ ట్యూబ్‌లు మాత్రమే ఉండగా, అరిధమన్‌లో వాటి సంఖ్యను ఎనిమిదికి పెంచారు. అంటే దీని దాడి సామర్థ్యం ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఇది:

  • 8 K-4 క్షిపణులు: 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.
  • 24 K-15 (సాగరిక) క్షిపణులు: స్వల్ప శ్రేణి దాడులకు అత్యంత ప్రభావవంతమైనవి.
  • బంగాళాఖాతంలోని సురక్షిత ప్రాంతాల్లో ఉంటూనే శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా వ్యూహాత్మక లక్ష్యాలను ఇది ధ్వంసం చేయగలదు.
  • బరువు: 7,000 టన్నులు
  • పొడవు: 130 మీటర్లు
  • రియాక్టర్: 83 MW ప్రెషరైజ్డ్ లైట్-వాటర్
  • వేగం: 24 నాట్లు (నీటి అడుగున)
  • ఆయుధాలు: K-4, K-15 క్షిపణులు
  • స్వదేశీ పరిజ్ఞానం: 75%

కనిపించని మృత్యువు.. వినిపించని అడుగు!

అరిధమన్ కేవలం వేగం కోసమే కాదు, 'రహస్యం' (Stealth) కోసం రూపొందించబడింది. అధునాతన స్వదేశీ సోనార్ వ్యవస్థలు, మెరుగైన అకౌస్టిక్ సైలెన్సింగ్ సాంకేతికత వల్ల ఇది సముద్రం లోపల కదులుతున్నా శత్రువుల రాడార్లకు చిక్కదు. 'ముందుగా దాడి చేయని' (No First Use) భారత అణు సిద్ధాంతానికి ఇది వెన్నెముకగా నిలుస్తుంది. శత్రువు మనపై దాడికి తెగబడితే, ఎక్కడో సముద్ర గర్భంలో దాగి ఉన్న అరిధమన్ సెకన్ల వ్యవధిలో ప్రతీకార దాడిని ప్రారంభించి శత్రువును నామరూపాలు లేకుండా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+