ఇండియా ఎంత గొప్పగా కనిపిస్తోందంటే..! మోడీతో సంతోషం పంచుకున్న శుభాన్షు..!

రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా చరిత్ర కెక్కిన యాక్సియాన్ 4 మిషన్ పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఇవాళ ప్రధాని మోడీతో మాట్లాడారు. తాజాగా యాక్సియాన్ 4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన శుభాన్షు అక్కడి నుంచి తనకు భారత్ ఎలా కనిపిస్తుందో ప్రధాని మోడీకి వివరించారు. ఆ వివరాలు ఎంతో సంతోషంగా ప్రధానితో పంచుకున్నారు.

భారతదేశం మ్యాప్‌లో కంటే అంతరిక్షం నుండి చూస్తే గొప్పగా, పెద్దదిగా కనిపిస్తుందని శుభాన్షు శుక్లా ప్రధాని మోడీకి తెలిపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన అనుభవాల్ని ఆయన ప్రధానికి వివరించారు. అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి చరిత్ర సృష్టించినందుకు శుక్లాను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఓ వ్యోమగామి మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ, అతను ఇప్పటికీ భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

india looks grand and bigger than map Axiom 4 mission pilot subhanshu Shukla told pm modi

"ఆప్కే నామ్ మే భీ శుభ్ హై ఔర్ ఆప్కీ యాత్రా నయే యుగ్ కా శుభరంభ్ భీ హై (మీ పేరులో శుభ్ (మంచిది) అనే పదం ఉందని, అలాగే మీ ప్రయాణం మన దేశ యువతకు కొత్త, ఆశాజనకమైన శుభారంభాన్ని సూచిస్తుందని ప్రధాని మోడీ శుభాన్షును ప్రశంసలతో ముంచెత్తారు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు 140 కోట్ల మంది భారతీయుల భావాలు మీతో ముడిపడి ఉన్నాయన్నారు.

ప్రతి భారతీయుడి ఉత్సాహం, గర్వం, ఆశలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మోడీ తెలిపారు. మీరు మన జాతీయ జెండాను అంతరిక్షంలోకి మోసుకెళ్తున్నప్పుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే మీ మిషన్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నని తెలిపారు. మోడీ మాటలకు స్పందంచిన శుభాన్షు.. తాను సురక్షితంగా ఉన్నానని, అంతరిక్ష కేంద్రంలో బాగానే ఉన్నానని, ఇదో పూర్తి కొత్త అనుభవమని తెలిపారు. అంతరిక్షంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, 140 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు.

india looks grand and bigger than map Axiom 4 mission pilot subhanshu Shukla told pm modi

భూమి నుండి కక్ష్యకు తన 400 కిలోమీటర్ల ప్రయాణం తన ప్రయాణం మాత్రమే కాదని, మొత్తం దేశం యొక్క ప్రయాణమని శుభాన్షు తెలిపారు.. తాను చిన్నతనంలో వ్యోమగామిని కాగలనని ఎప్పుడూ అనుకోలేదని, అయితే మోడీ నాయకత్వంలో దేశం తన కలలను నెరవేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+