Sethuraman Panchanathan: పద్మశ్రీ విజేతకు దక్కిన మరో అరుదైన గౌరవం! ఎవరీ పంచనాథన్?

1969లో చెన్నైలోని అమెరికన్ సెంటర్ ముందు ఒక ఎనిమిదేళ్ల కుర్రాడు తన తండ్రితో కలిసి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డాడు. అపోలో 11 ప్రయోగం ద్వారా నాసా శాస్త్రవేత్తలు చందమామపై నుంచి తెచ్చిన రాళ్లను చూడటమే అతని లక్ష్యం. అక్కడ క్యూలో నిలబడి ఆ రాళ్లను చూసినప్పుడు అతనికి ఆ రాళ్ల కంటే కూడా.. మనుషులు నింగిలోకి వెళ్లి వాటిని భూమిపైకి తెచ్చేందుకు వాడిన సైన్స్, ఇంజనీరింగ్ అద్భుతాలే ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించాయి.

ఆనాటి ఆ ఆసక్తి, ఆ కుర్రాడిని కాలక్రమేణా ప్రపంచం గర్వించే సైంటిస్ట్‌గా మార్చింది. ఆయనే మన భారత సంతతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్. ఇప్పుడు ఆయన అమెరికా ఇంజనీరింగ్ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆర్థర్ ఎమ్. బ్యూచే' (Arthur M. Bueche) అవార్డును గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

Indian American Scientist Sethuraman Panchanathan Wins Prestigious NAE Arthur M Bueche Award 2026

చరిత్ర తిరగరాసిన ఘనత.. తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు!

నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (NAE) ప్రకటించిన ఈ అవార్డు దాదాపు 40 ఏళ్ల చరిత్రలో ఒక భారతీయ అమెరికన్‌కు దక్కడం ఇదే తొలిసారి. అమెరికా సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాలను బలోపేతం చేయడంలో, యూనివర్సిటీలు-పరిశ్రమలు-ప్రభుత్వం మధ్య అనుసంధానకర్తగా అద్భుత సేవలు అందించినందుకు గాను పంచనాథన్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ASU) లో ప్రస్తుతం టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన, గతంలో ప్రసిద్ధ 'యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్' (NSF) 15వ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. అప్పట్లో కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ పరిశోధనలు, సైన్స్ రంగాన్ని ముందుకు నడపడంలో ఆయన చూపిన నాయకత్వ పటిమ శభాష్ అనిపించుకుంది.

ADC పదవికి మేజర్ రిషభ్ రాజీనామా. రాష్ట్రపతి గురించి సంచలన విషయాలు
ADC పదవికి మేజర్ రిషభ్ రాజీనామా. రాష్ట్రపతి గురించి సంచలన విషయాలు

పరిశోధనశాల నుంచి ప్రజల్లోకి టెక్నాలజీ!

కేవలం ల్యాబ్‌లకే పరిమితమైన విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చడమే పంచనాథన్ (స్నేహితులు 'పంచ్' అని పిలుచుకుంటారు) ప్రధాన లక్ష్యం. ఆయన ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి, సాంకేతికతను ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. ఆరిజోనా యూనివర్సిటీలో ఆయన లీడర్‌షిప్‌లో పరిశోధనల పరిమాణం మూడు రెట్లు పెరగడమే కాకుండా, అమెరికాలోనే అత్యంత ఇన్నోవేటివ్ యూనివర్సిటీగా అది పేరుగాంచింది. ప్రస్తుతం ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో కీలక పరిశోధనలు చేస్తున్నారు.

41 ఏళ్ల తపస్సు.. పద్మశ్రీ సాధించిన విదేశీ మహిళ.
41 ఏళ్ల తపస్సు.. పద్మశ్రీ సాధించిన విదేశీ మహిళ.

అంతర్జాతీయ గుర్తింపు.. భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ'!

పంచనాథన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2025లోనే ఆయనను ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. "ఈ అవార్డు కేవలం నా ఒక్కడిది కాదు, నా ప్రయాణంలో సహకరించిన గురువులు, కుటుంబం, విద్యార్థులు, తోటి శాస్త్రవేత్తల అందరిదీ" అని పంచనాథన్ చాలా వినయంగా పేర్కొన్నారు. రాబోయే అక్టోబర్‌లో వాషింగ్టన్ డీసీలో జరగనున్న నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ వార్షిక సమావేశంలో ఆయనకు ఈ అవార్డును అధికారికంగా బహూకరించనున్నారు. చెన్నై వీధుల నుంచి మొదలైన ఒక భారతీయుడి ప్రయాణం.. ఈరోజు అమెరికా అత్యున్నత అణు, సైన్స్ విధానాలను శాసించే స్థాయికి ఎదగడం ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+