మనిషి కళ్లతో చూసిన అత్యంత అరుదైన భూమి దృశ్యం!

నీంగిలోకి దూసుకెళ్లిన 'ఒరియన్' వ్యోమనౌక అంతరిక్షంలో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తన ప్రధాన ఇంజిన్ 'ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ బర్న్'ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే దిశగా కీలక అడుగు వేసింది. 1972లో జరిగిన అపోలో-17 మిషన్ తర్వాత, మళ్ళీ ఇప్పుడు నలుగురు వ్యోమగాములు భూమి కక్ష్యను దాటి చంద్రుడి వైపు పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి భూమి నెలవంకలా కనిపించడాన్ని గమనించిన ఒరియన్.. దాన్ని ఫోటో తీసింది. నిజంగా ఒక అపురూపమైన దృశ్యం.

ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా యొక్క శక్తివంతమైన ఎస్ఎల్‌ఎస్ (SLS) రాకెట్ ఒరియన్ వ్యోమనౌకను మోసుకెళ్తూ నింగిలోకి దూసుకెళ్లింది. నాసాకు చెందిన రీడ్ వైస్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగస్వాములయ్యారు. అంతరిక్షంలోకి చేరుకున్న వెంటనే ఒరియన్ తన నాలుగు సోలార్ ప్యానెల్స్ ను తెరిచి సూర్యుడి నుంచి శక్తిని పొందడం ప్రారంభించింది. ఈ 10 రోజుల టెస్ట్ ఫ్లైట్ ద్వారా వ్యోమనౌక సామర్థ్యాన్ని, వ్యోమగాముల మనుగడకు అవసరమైన వ్యవస్థలను నాసా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

NASA Shares Breathtaking View of Earth as a Crescent From Orion Spacecraft on Its Epic Journey to Moon

చంద్రుడి 'దూరపు తీరం'పై కన్నేసిన వ్యోమగాములు

మిషన్ ప్లాన్ ప్రకారం, ఏప్రిల్ 6 (సోమవారం) నాడు వ్యోమగాములు చంద్రుడికి అత్యంత సమీపంలోకి (లూనార్ ఫ్లైబై) వెళ్లనున్నారు. ఈ సమయంలో మానవ కళ్లకు నేరుగా కనిపించని చంద్రుడి అవతలి వైపు (Far Side) భాగాన్ని వారు వీక్షించనున్నారు. అక్కడి పర్వతాలు, లోయలు, క్రేటర్లను హై-రిజల్యూషన్ చిత్రాల రూపంలో బంధించనున్నారు. చంద్రుడిపై పడే సూర్యుడి నీడల సహాయంతో ఉపరితలంపై ఉన్న ఎత్తుపల్లాలను మరింత స్పష్టంగా అధ్యయనం చేసే అవకాశం ఈ మిషన్ ద్వారా లభిస్తుంది.

అంగారకుడి యాత్రకు ఇదే పునాది!

"మేము చేరుకునే ప్రతి మైలురాయి ఆర్టెమిస్ కార్యక్రమానికి ఒక గొప్ప పురోగతి. ఇది కేవలం చంద్రుడి యాత్ర మాత్రమే కాదు, భవిష్యత్తులో అంగారకుడి (Mars) పైకి మానవుడిని పంపే మహాత్కార్యానికి గట్టి పునాది" అని నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ లోరీ గ్లేజ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యోమగాములు అంతరిక్ష వాతావరణానికి అలవాటు పడుతూ, వ్యాయామం, వ్యవస్థల తనిఖీల్లో నిమగ్నమయ్యారు.

చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసిన అనంతరం, ఈ నలుగురు వ్యోమగాములు శాన్ డియాగో తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అవ్వనున్నారు. ఈ మిషన్ పురోగతిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా గమనిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+