రూ.11,500 కే " రెడ్‌మీ 15సీ " 5G.. ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ !!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్‌లలో రెడ్‌మీ ముందంజలో దూసుకుపోతోంది. అందులోనే భాగంగా ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం షావోమీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా షావోమి సంస్థ రెడ్‌మీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది.
కాగా 5G ఫోన్‌ల ధరలు సాధారణంగా రూ.14,000-రూ.16,000 వరకు ఉండగా.. రెడ్‌మీ మాత్రం తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందించేందుకు సిద్ధమైంది. భారతీయ వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా "పర్ఫార్మెన్స్ + ప్రైస్" కలయికను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. సెప్టెంబర్‌లో గ్లోబల్‌గా లాంచ్ అయిన రెడ్‌మీ 15సీ 5G ఈ నెలాఖరులో భారతదేశంలోకి ప్రవేశించనుంది. ఇప్పటికే మధ్యతరగతి యూజర్లలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం..

" రెడ్‌మీ 15సీ " 5G ఫీచర్స్..
ధరలు..
4GB + 128GB : రూ.11,500
6GB + 128GB : రూ.12,500
8GB + 128GB : రూ.14,500
ఈ ధరలను చూస్తే ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమయ్యే అత్యల్ప ధరల 5G ఫోన్‌లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.
ప్రాసెసర్ & పనితీరు..
రెడ్‌మీ 15సీ 5Gలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
గేమింగ్‌కు సరిపడ ప్రదర్శన
పవర్ ఎఫిషియెన్సీ
5G నెట్‌వర్క్‌లో స్థిరమైన కనెక్టివిటీ అందించగలదని కంపెనీ చెబుతోంది.
డిజైన్ & డిస్‌ప్లే..
ఈ మోడల్‌లో ఉన్న 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే బడ్జెట్ విభాగంలో అరుదుగా కనిపించే పెద్ద సైజ్.
120Hz రిఫ్రెష్ రేట్ - స్మూత్ స్క్రోలింగ్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్ - గేమింగ్‌కు బెటర్ రెస్పాన్స్
810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ - బాహ్య వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించడానికి వీలు
బ్యాటరీ & ఛార్జింగ్..
6,000mAh భారీ బ్యాటరీ - ఒకసారి ఛార్జ్‌చేస్తే రోజు మొత్తం నడిచే అవకాశం
33W ఫాస్ట్ ఛార్జింగ్ - త్వరగా ఛార్జ్ అయిపోవడం
ఈ ఫీచర్లతో దీన్ని పవర్ యూజర్లు కూడా సులభంగా ఉపయోగించవచ్చు.
కెమెరా..
50MP రియర్ కెమెరా - AI ఎన్హాన్స్‌మెంట్‌తో క్లియర్ ఫోటోలు
8MP ఫ్రంట్ కెమెరా - స్టడీ సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సరిపడ మానసికత
బడ్జెట్ సెగ్మెంట్‌కు కావాల్సిన కెమెరా స్టాన్డర్డ్స్‌ను ఇది పూర్తిగా నెరవేరుస్తుంది.
కనెక్టివిటీ & అదనపు ఫీచర్లు..
బ్లూటూత్ 5.4
Wi-Fi సపోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్ - కొత్త ఫోన్‌లలో అరుదుగా కనిపించే ఫీచర్
IP64 రేటింగ్ - స్ప్లాష్ & డస్ట్ ప్రొటెక్షన్
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
AI ఫేస్ అన్‌లాక్
హై-రెసల్యూషన్ ఆడియో సపోర్ట్
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..!












Click it and Unblock the Notifications