Super El Nino: ప్రపంచానికి భారీ నష్టం! భారత్‌కు 50 బిలియన్ల డాలర్ల షాక్

పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థపై ఎల్ నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పసిఫిక్ సముద్రంలో పురుడుపోసుకుంటున్న ఈ సరికొత్త వాతావరణ గందరగోళం కారణంగా 2027 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 451 బిలియన్ డాలర్ల మేర నష్టపోయే ప్రమాదం ఉందని 'అలియంజ్ రీసెర్చ్' నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కేవలం భారత్, అమెరికా, చైనా దేశాలకే దాదాపు 60 శాతం మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

అలియంజ్ క్లైమేట్ ఎకనామిక్స్ రిపోర్ట్ ప్రకారం.. చైనా అత్యధికంగా 147 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసే అవకాశం ఉండగా, ఆ తర్వాతి స్థానంలో అమెరికా 91 బిలియన్ డాలర్లతో, భారత్ 50 బిలియన్ డాలర్ల నష్టంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 144 దేశాల అంచనా జీడీపీలో ఇది సుమారు 0.24 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. గతంలో 2023-24 మధ్య కాలంలో నమోదైన ఎల్ నినో పరిస్థితులకు దేశాలు ఏ విధంగా స్పందించాయనే దాని ఆధారంగానే ఈ అంచనాలను రూపొందించారు.

Super El Nino Impact Global Economy To Lose 451 Billion Dollars In 2027 With India Facing Huge Losses

ఎల్ నినో అంత ప్రమాదకరమా?

మధ్య మరియు తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కడాన్నే 'ఎల్ నినో' అంటారు. ఇది మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ గాలి ప్రవాహాలను, వర్షపాతాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఉత్పాదకత తగ్గిపోవడం, పంట దిగుబడులు దెబ్బతినడం, కూలింగ్ కోసం విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడం జరుగుతుంది. అయితే ఈ 451 బిలియన్ డాలర్ల నష్టాల అంచనా కేవలం ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం మాత్రమేనని, ఇందులో భారీ వరదలు, తీవ్రమైన కరువులు, కార్చిచ్చుల వంటి విపత్తుల వల్ల జరిగే అదనపు నష్టాలు కలపలేదని నివేదిక స్పష్టం చేసింది.

ఒకేసారి మూడు భారీ తుఫానులు! శాటిలైట్స్ కంటపడ్డ భయానక దృశ్యాలు
ఒకేసారి మూడు భారీ తుఫానులు! శాటిలైట్స్ కంటపడ్డ భయానక దృశ్యాలు

సామాన్యులపై ఎగసిపడనున్న ధరల మంట

ఈ వాతావరణ మార్పుల ఆర్థిక ప్రభావం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా నేరుగా సామాన్యుల జేబులకు చిల్లు పెట్టనుంది. ఎల్ నినో షాక్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సాధారణ ద్రవ్యోల్బణం సగటున 0.42 శాతం పెరిగితే, ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం ఏకంగా 0.65 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అలియంజ్ అంచనా వేసింది. దీనివల్ల నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది.

El Nino: 2009 నాటి ఘోర పరిస్థితి తర్వాత.. 17 ఏళ్లకు మళ్లీ అదే సీన్!
El Nino: 2009 నాటి ఘోర పరిస్థితి తర్వాత.. 17 ఏళ్లకు మళ్లీ అదే సీన్!

రానున్న కాలంలో మరిన్ని సవాళ్లు

వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేనంతగా దెబ్బతింటున్నాయి. కేవలం విపత్తుల కారణంగానే 2025లో ప్రపంచవ్యాప్తంగా 210 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. అయితే ఇది కేవలం ఒక అంచనా విశ్లేషణ మాత్రమేనని, రాబోయే రోజుల్లో సంభవించే విపరీత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నష్టాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణ నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో దేశాల ఆర్థిక మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+