Google Maps: ముగ్గురి ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్.. గుడ్డిగా టెక్నాలజీని నమ్మడమే తప్పైంది

Navigation Error: తెలియని ప్రాంతాలకు నావిగేషన్‌తో పాటు పర్యాటకులకు గూగుల్ మ్యాప్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ సంస్థల వ్యాపారాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గూగుల్‌ మ్యాప్స్‌ను అన్నిసార్లు నమ్మలేమని ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో రుజువైంది. మ్యాప్స్‌ ఆధారంగా గుడ్డిగా ప్రయాణించిన వారికి చాలా చేదు అనుభవాలు సైతం ఎదురయ్యాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో GPS నావిగేషన్ వల్ల ఒక విషాద సంఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి ఓ కారు రామగంగా నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఉదయం 10:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు తెలిపారు. బరేలీ నుంచి డేటాగంజ్‌కు వెళ్తున్న క్రమంలో డ్రైవర్ GPS నావిగేషన్‌ని ఉపయోగిస్తున్నాడని, అది కారుని వంతెన దెబ్బతిన్న చోటుకి మరలించడం ఈ దుర్ఘటనకు కారణంగా వెల్లడించారు.

Three died due to Google Maps Navigation error

'ఈ ఏడాది ప్రారంభంలో వరదల కారణంగా వంతెన ముందు భాగం నదిలో కూలిపోయింది. ఇది GPSలో అప్‌డేట్ చేయబడలేదు' అని ఏం ఆ ఏరియా సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ శివమ్ వివరించారు. ఆ ప్రాంతానికి సమీపంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేదా వాహనాలను నియంత్రించడానికి సంకేతాలు లేకపోవడం ప్రమాదానికి మరో కారణంగా చెబుతున్నారు.

కారు అతివేగంతో ప్రయాణిస్తుండడంతో చివరి క్షణంలో ఆపడం కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. అంతే వేగంతో కారు ఒక్కసారిగా 25 అడుగుల రామగంగా నదిలో పడిపోయింది. దీంతో ముగ్గురు ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించినట్లు ఓ యూజర్ తన X అకౌంట్‌లో పోస్ట్ చేసారు. అందుకే గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకూడదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+