ఐదేళ్లలో 88 నోబాల్స్ - టీమిండియా బౌలర్ చెత్త రికార్డు..!
అసలే ఓవైపు టీ20ల రాకతో టెస్టు క్రికెట్ కనుమరుగై పోతోందని క్రికెట్ అభిమానులు బాధపడుతుంటే, ఆడుతున్న కొన్ని మ్యాచ్ ల్లో సైతం భారత క్రికెటర్ల ప్రదర్శన అంతంత మాత్రంగా ఉంటోంది. సాధారణంగా చిన్నా చితకా జట్లు ఎదురపడితే రికార్డులు సృష్టించే, తిరగరాసే భారత బౌలర్లు.. ఇప్పుడు శ్రీలంకతో ఆడుతున్న టెస్టు సిరీస్ లో దానికి భిన్నంగా చెత్త రికార్డుల బాట పట్టారు. ఇందులో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అగ్ర స్ధానంలో నిలిచాడు.
టెస్టుల్లో ఆడుతున్న భారత జట్టులో సీనియర్ ఆటగాడు, సీనియర్ స్పిన్నర్ కూడా అయిన రవీంద్ర జడేజా ఓ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇప్పుడు నెలకొల్పింది కాదు, గతంలోనే ఈ రికార్డు సాధించాడు. అయితే ఇప్పుడు రానురానూ దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా తరచుగా నో బాల్స్‌తో ఇబ్బంది పడుతున్నాడని అతని టెస్ట్ గణాంకాలను చూస్తే స్పష్టంగా అర్దమవుతుంది. దీనికి కారణం అతను తరచుగా వేస్తున్న నోబాల్స్ (No-Balls).

ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో.. జడేజా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 3 నో బాల్స్ వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సైతం మరో నోబాల్ వేశాడు. దీంతో 2021 నుండి టెస్టుల్లో అతని నో-బాల్స్ సంఖ్య ఏకంగా 88కి చేరింది. ఇదే కాలంలో టెస్ట్ క్రికెట్‌లో ఏ స్పిన్నర్ కూడా ఇన్ని నోబాల్స్ వేయలేదు. అంతే కాదు జడేజా వేసిన 88 నోబాల్స్ లో సగం కూడా వేయలేదంటే నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ ఐదేళ్లలో నోబాల్స్ వేసిన టెస్టు బౌలర్ల జాబితా చూస్తే అందులో జడేజా తర్వాత స్ధానంలో ఉన్నది పాకిస్తాన్ స్పిన్నర్ నోమాన్ అలీ. అతను 40 నోబాల్స్ వేసాడు. ఇప్పటికే శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 2 నో బాల్స్, రెండవ ఇన్నింగ్స్‌లో 2 నో బాల్స్ వేశాడు. దీంతో జడేజా చెత్త రికార్డు ఎప్పటికప్పుడు ఇంకా అధ్వాన్నంగా మారుతోంది.














Click it and Unblock the Notifications