ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో అనూహ్య పరిణామం: ఢిల్లీ వేదికగా..
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవలే జింబాబ్వే పర్యటనను దిగ్విజయంగా ముగించుకుంది. ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో చవి చూసిన పరిపూర్ణ ఓటముల గాయాన్ని జింబాబ్వే సిరీస్ కొంతవరకు నయం చేయగలిగింది. ఇక తన తదుపరి సిరీస్ కు సమాయాత్తమౌతోంది టీమిండియా. సెప్టెంబర్ లో మూడు టీ20 మ్యాచ్ లను ఆడబోతోంది.
ఈ సారి.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనున్నాయి.. ఈ మూడు మ్యాచ్ లు కూడా. ఈ సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ లో భారత్ తో సిరీస్ కు ఆ దేశ జట్టు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ అధికారికంగా ప్రకటించాయి. మ్యాచ్ లకు అధికారికంగా ఆమోద ముద్ర వేశాయి.

ఆఫ్ఘనిస్తాన్ లో మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేనందున.. తన హోమ్ సిరీస్‌ను భారత్ వేదికగా జరపాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్లానింగ్ లో భాగంగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 13వ తేదీన మొదటి మ్యాచ్ ఆరంభమౌతుంది. 15, 17 తేదీల్లో మిగిలిన రెండింటినీ నిర్వహిస్తారు. ఒకే స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడబోతోండటం పట్ల క్రేజ్ ఏర్పడింది.
ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడారు. ప్రపంచ స్థాయి జట్లతో తలపడటానికి, తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడానికి ఇలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించడానికి తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.













Click it and Unblock the Notifications