Daylight Saving Time: 1966 చట్టానికి అమెరికా బైబై? 19 రాష్ట్రాల ఏకగ్రీవ నిర్ణయం

ఏడాదికి రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని గంట ముందుకు, వెనక్కి మార్చే పాతకాలపు పద్ధతికి శాశ్వతంగా స్వస్తి చెప్పాలని అమెరికా భావిస్తోంది. వేసవిలో గంట ముందుకూ, చలికాలం రాగానే గంట వెనక్కూ ముల్లు తిప్పే ఈ 'డేలైట్ సేవింగ్ టైమ్' (DST) విధానం వల్ల ప్రజల నిద్ర భంగమవ్వడమే కాకుండా టైం టేబుల్ దెబ్బతింటోందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ తలనొప్పి వ్యవహారానికి తిలోదకాలు ఇచ్చి, ఏడాది పొడవునా ఒకే సమయాన్ని పాటించేలా ఇప్పటికే అమెరికాలోని 19 రాష్ట్రాలు ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించాయి.

అసలు సమస్య వాషింగ్టన్‌లోనే!

అయితే ఈ 19 రాష్ట్రాలు చట్టాలు చేసినప్పటికీ, వాటిని అమలు చేయడానికి ప్రస్తుత ఫెడరల్ నిబంధనలు అంగీకరించడం లేదు. అమెరికాలో 1966 నాటి 'యూనిఫాం టైమ్ యాక్ట్' ప్రకారం.. ఏదైనా రాష్ట్రం ఏడాది పొడవునా పాత సాధారణ సమయాన్ని మాత్రమే అనుసరించాలనుకుంటే స్వేచ్ఛ ఉంది. కానీ, నిరంతరం ఈ మార్చిన 'డేలైట్ సేవింగ్' సమయాన్నే కొనసాగించాలంటే మాత్రం తప్పనిసరిగా దేశ అత్యున్నత చట్టసభ అయిన యూఎస్ కాంగ్రెస్ నుంచి ప్రత్యేక అనుమతి లేదా చట్ట సవరణ కావాలి. దీంతో ఈ రాష్ట్రాలన్నీ ప్రస్తుతం వాషింగ్టన్ ఇచ్చే ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.

Daylight Saving Time Debate 19 US States Pass Legislation to Stop Changing Clocks Permanently
రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆచారం బంద్.. అమెరికాలో మారబోతున్న టైం!
రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆచారం బంద్.. అమెరికాలో మారబోతున్న టైం!

లైన్లో ఉన్న రాష్ట్రాలివే..

ఫ్లోరిడా రాష్ట్రం 2018లో తొలిసారిగా ఈ దిశగా ముందడుగు వేయగా, ఆ తర్వాత మరో 18 రాష్ట్రాలు అదే బాటలో నడిచాయి. కాలిఫోర్నియా, ఒహియో, టెన్నెస్సీ, జార్జియా, వాషింగ్టన్, అలబామా, కొలరాడో, మైనే, మిసిసిపీ, యూటా వంటి ప్రముఖ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలైతే తమ పొరుగు రాష్ట్రాలు కూడా ఈ మార్పును అంగీకరిస్తేనే అమలు చేస్తామని షరతులు విధించాయి. ఏడాది పొడవునా సాయంత్ర వేళల్లో ఎక్కువ సమయం వెలుతురు ఉండటం వల్ల వ్యాపారాలు, పిల్లల ఆటపాటలకు ఎంతో మేలు జరుగుతుందని మద్దతుదారులు వాదిస్తున్నారు.

Doomsday clock హెచ్చరికలు; 85 సెకన్ల దూరంలో వినాశనం
Doomsday clock హెచ్చరికలు; 85 సెకన్ల దూరంలో వినాశనం

మినహాయింపుల్లో ఆ రెండు రాష్ట్రాలు!

అమెరికాలో ఇప్పటికే ఆరిజోనా, హవాయి రాష్ట్రాలతో పాటు ప్యూర్టోరికో, గువామ్ వంటి కొన్ని అమెరికన్ దీవులు ఈ గడియారం ముల్లు తిప్పే విధానానికి దూరంగా ఉంటున్నాయి. అవి మొదటి నుంచీ సాధారణ సమయాన్ని మాత్రమే పాటిస్తున్నాయి. అయితే మిగిలిన 19 రాష్ట్రాలు మాత్రం శాశ్వతంగా డేలైట్ సేవింగ్ విధానంలోకే మారాలని పట్టుబడుతున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప, ప్రస్తుతానికి మాత్రం అమెరికన్లకు ప్రతి ఏటా గడియారాలు మార్చే ఈ విచిత్రమైన కసరత్తు తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+