టీజీ ఈ-టికెట్‌ యాప్‌... తెలంగాణాలో వాహన దొంగలకు ఇక చుక్కలే!

ఎంతో కష్టపడి కొనుక్కున్న బైక్ లేదా కారు చోరీకి గురైతే వాహన యజమానికి విపరీతమైన బాధ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, వాహనాన్ని ట్రేస్ అవుట్ చేసి తిరిగి వాహనం వారి వద్దకు వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. అప్పటివరకు యజమానులకు ఆందోళన కొనసాగుతుంది. అయితే ఇకపై ఆ ఆందోళన అవసరం లేదని అంటున్నారు పోలీసులు.

వాహనాలు చోరీలకు గురైతే ఇకపై పట్టుకోవటం చాలా సులువని చెప్తున్నారు పోలీసులు. వాహన చోరీల సమస్యకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను వేగంగా గుర్తించేందుకు 'టీజీ ఈ-టికెట్' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

TG E-Ticket App Telangana Police s TG E-Ticket App helps track and recover stolen vehicles quickly

రాష్ట్రంలో ఏటా దాదాపు 7 వేల నుంచి 8 వేల వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 90 శాతం వరకు బైక్‌లే ఉంటున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలు ఒక చోట దొంగిలించి మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నారు. వాహనం పోయిన వెంటనే యజమాని సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి.

అప్పుడే వాహన నంబర్, మోడల్ వంటి వివరాలు డేటాబేస్‌లో చేరుతాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు తమ ట్యాబ్‌లలో ఈ యాప్‌ను వాడుతున్నారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వాహనం కనిపిస్తే ఫొటో తీస్తే చాలు. అది ఇప్పటికే చోరీ కేసులో నమోదై ఉంటే యాప్ వెంటనే అలర్ట్ ఇస్తుంది. అలా ఆ వాహనం పట్టుకోవటం ఈజీ అవుతుంది.

వరంగల్ విమాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!
వరంగల్ విమాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!

వాహనం ఎక్కడ దొంగిలించబడింది, ఏ స్టేషన్‌లో కేసు ఉంది, అసలు యజమాని ఎవరు అనే వివరాలు కూడా చూపిస్తుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకు 90కిపైగా చోరీ వాహనాలను గుర్తించారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలైతే బాధితులకు త్వరగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వాహనం కనిపించకపోతే వెంటనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. ఇక ఈ యాప్ తో చోరీలు చేసేవారికి చుక్కలే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+