హోమ్ వర్కౌట్.. టెక్ దిగ్గజంలో కట్: ఆ పాపులర్ విభాగంపై వేటు

ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. మరో విడత లేఆఫ్స్ ను అమలు చేయబోతోంది. రెండు నెలల వ్యవధిలో రెండోసారి ఉద్యోగులను తొలగించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈసారి తన సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ హోమ్ వర్కౌట్ విభాగం ఫిట్‌నెస్ ప్లస్ (Fitness+) లోని ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం, కొన్ని విభాగాలను పునర్వ్యవస్థీకరించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ తాజా ఉద్యోగాల కోత ప్రభావం ప్రధానంగా ఫిట్‌నెస్ ప్లస్ సర్వీస్‌లోని ఆడియో కంటెంట్ విభాగంపై పడింది. యాపిల్ వాచ్ యూజర్లుకు అనువుగా ఉండే ఆడియో ఆఫరింగ్స్ టీమ్ లపై తాజా లేఆఫ్ ప్రభావం పడినట్లు చెబుతున్నారు. దీనిపై బ్లూమ్‌బెర్గ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యాపిల్ వాచ్ ద్వారా లభించే టైమ్ టు వాక్, టైమ్ టు రన్.. వంటి ఆడియో ఫీచర్లపై పనిచేసే సిబ్బందిని తొలగించినట్లు వెల్లడించింది.

Apple Reportedly Conducts Second Round of Layoffs in Under Two Months Fitness Plus Hit Audio Team

దీనివల్ల రాబోయే రోజుల్లో నూతన ఆడియో ఎపిసోడ్‌ల విడుదల నెమ్మదించే అవకాశం ఉంది. ఈ ఫిట్‌నెస్ సర్వీసులను ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేయట్లేదని, అందులో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి మాత్రమే యాపిల్ మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ కథనం వివరించింది. ఈ తాజా నిర్ణయంతో ఎంతమంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారనేది తెలియరావట్లేదు. ఈ సంఖ్య ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి కీ పోస్టింగులు: ఈ జిల్లాలకు నూతన ఎస్పీలు
కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి కీ పోస్టింగులు: ఈ జిల్లాలకు నూతన ఎస్పీలు

నిజానికి.. కిందటి నెలలోనే దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులను ఒకేసారి తొలగించింది యాపిల్. వర్చువల్ అసిస్టెంట్ సిరి, అత్యాధునిక విజన్ ప్రో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్ ఆపరేషన్లలో ఈ లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి.. అప్పట్లో. ఇప్పుడు ఫిట్‌నెస్ ప్లస్ డివిజన్ లో కోతలకు శ్రీకారం చుట్టింది. గ్యాడ్జెట్ యూజర్లకు మరింత అధునాతన డిజిటల్ సర్వీసులను అందించడానికే కొన్ని కీలక రంగాలలో ఈ మార్పులు చేస్తున్నామని యాపిల్ స్పష్టం చేసింది.

బంగారం ధరల్లో తాజా పరిణామాలు: మరో అవకాశం?
బంగారం ధరల్లో తాజా పరిణామాలు: మరో అవకాశం?

హోమ్ వర్కౌట్ సర్వీసుల నిర్వహణ యాపిల్‌కు భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో నిలకడ లోపించడం వల్ల అనుకున్నంత రెవెన్యూ రావట్లేదు. అలాగే.. ఎప్పటికప్పుడు నూతన కంటెంట్‌ను జిమ్ ట్రైనర్స్ తో రూపొందించాల్సి రావడం కంపెనీకి భారంగా పరిణమించింది. భవిష్యత్తులో ఈ ఫిట్‌నెస్ ప్లస్ ఫీచర్లను నేరుగా యాపిల్ హెల్త్ యాప్‌తో అనుసంధానం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+