గ్రామమంతా వ్యభిచారంలోనే!.. ఆ గ్రామంలో విచిత్ర పరిస్థితి!

ఉపాధి అవకాశాలు లేకపోవడం, అజ్ఞానం, పేదరికం మహిళల పాలిట శాపంగా మారుతోంది. బతుకుదెరువు కోసం బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దిగాల్సి వస్తోంది. ఈ క్రమంలో చిన్న వయసులోనే మనసు చంపుకొని వ్యభిచార వృత్తిలోకి దిగాల్సి వస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో , అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'వాడియా' అనే గ్రామంలో దశాబ్ధాలుగా ఈ అనాచారం కొనసాగుతోంది. దాదాపు 750 జనాభా ఉన్న ఈ గ్రామంలో 'సరణియా' అనే సంచార తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. తరతరాలుగా ఈ సమాజంలోని మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టడం, పురుషులు వారికి వినియోగదారులను(కస్టమర్లను) వెతకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దారుణమైన ఆచారం నుంచి తమ కుమార్తెలను రక్షించుకోవడానికి గ్రామస్థులు ఏడేళ్ల చిన్నతనంలోనే బాలికలకు ఎంగేజ్మెంట్లు జరిపిస్తున్నారు.

మరో 10 రోజుల్లో రుతుపవనాలు ఖతం! శాటిలైట్ చిత్రాలతో ఐఎండీ షాకింగ్ రిపోర్ట్
మరో 10 రోజుల్లో రుతుపవనాలు ఖతం! శాటిలైట్ చిత్రాలతో ఐఎండీ షాకింగ్ రిపోర్ట్

ఓ అనాచారాన్ని ఆపేందుకు మరో చట్టవిరుద్ధ మార్గం
వారసత్వంగా వస్తున్న వ్యభిచార వృత్తి నుంచి బాలికలను కాపాడేందుకు ఈ నిశ్చితార్థాల పద్ధతి కొంతవరకు దోహదపడినప్పటికీ.. ఇది మరో పెద్ద సమస్యకు దారితీస్తోంది. ఇండియాలో బాల్యవివాహాలు పూర్తిగా నిషేధించబడినప్పటికీ.. ఓ రకమైన శోషణ నుంచి పిల్లలను కాపాడేందుకు బాల్య ఎంగేజ్మెంట్లు/వివాహాలు అనే మరో చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాల్సి రావడం ఇక్కడ ధర్మసంకటంగా మారింది. ఎంగేజ్మెంట్ లేదా వివాహం జరిగిన అమ్మాయిలను సాధారణంగా వ్యభిచారంలోకి నెట్టారనే అనధికారిక నమ్మకమే దీనికి ప్రధాన కారణం.

Gujarat Vadia Village Mothers Arrange Early Engagements to Secure Young Daughters from Exploitation

తరతరాల దారిద్య్రం.. ఓ తల్లి నిశ్చయం
ఈ గ్రామానికి చెందిన 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని తన అనుభవాన్ని పంచుకుంటూ.. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ లైంగిక వృత్తిలోనే జీవించారని తెలిపింది. తన తండ్రి, బాబాయిలు విజిటర్లను తీసుకురావడం చూస్తూ పెరిగిన ఆమె తల్లి, పేదరికం వల్లే ఈ ఆచారాన్ని కొనసాగించాల్సి వచ్చిందని చెప్పింది. అయిత తన కూతురిని మాత్రం ఈ కూపంలోకి రానివ్వకూడదని నిశ్చయించుకుని, ఆమెకు 11 ఏళ్ల వయస్సులోనే నిశ్చితార్థం జరిపించి, 18 ఏళ్ల వచ్చాక వివాహం చేసింది. గ్రామానికి చెందిన చంద్ర సరణియా అనే మరో మహిళ కూడా 15 ఏళ్లకే ఈ వృత్తిలోకి నెట్టబడగా.. తన కూతురిని కాపాడుకోవడానికి 12 ఏళ్ల ఎంగేజ్మెంట్ జరిపించినట్లు పేర్కొంది.

మనోళ్లు గురి పెడితే.. పతకం పడాల్సిందే: భారత్ హవా కంటిన్యూస్
మనోళ్లు గురి పెడితే.. పతకం పడాల్సిందే: భారత్ హవా కంటిన్యూస్

ఎన్జీవోల చొరవ.. 2012 నాటి మార్పు
'విచార్తా సముదాయ్ సమర్థన్ మంచ్' అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మిట్టల్ పటేల్ నేతృత్వంలో 2012 నుంచి ఈ గ్రామంలో మార్పు ప్రారంభమైంది. కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, దళారులను అడ్డుకోవడం, ఎంగేజ్మెంట్లు చేయడం ద్వారా అనేక మంది బాలికలను ఈ వృత్తి నుంచి కాపాడగలిగారు. 160 కుటుంబాలలో దాదాపు 90 కుటుంబాలు ఈ వృత్తిని వదిలేయడానికి అంగీకరించాయి. అంతే కాకుండా వ్యవసాయ భూములను పునరుద్ధరించడం, నీటి సౌకర్యాలు కల్పించడం, వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించారు.

చారిత్రక నేపథ్యం
సరణియా తెగవారు ఒకప్పుడు మేవార్ మహారాణా ప్రతాప్ సైన్యంతో కలిసి ప్రయాణించేవారు. పురుషులు ఆయుధాల తయారీ, నిర్వహణ చూసుకోగా.. మహిళలు సైనికులను అలరించేవారు. 1947 స్వాతంత్య్రం తర్వాత ఉపాధి కోల్పోవడంతో జీవనోపాధి కోసం ఈ సమాదం వ్యభిచారాన్ని ఎంచుకుంది. ప్రస్తుతం విద్య, వ్యవసాయం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా ఈ కళంకాన్ని తుడిచిపెట్టుకోవాలని వాడియా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఓ హానికరమైన సంప్రదాయం నుంచి పిల్లలను రక్షించడానికి మరో బాల్య వివాహ వ్యవస్థను ఆశ్రయించాల్సి రావడం ఇంకా పరిష్కరించబడని ప్రశ్నగానే మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+